పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తన భార్యకు విశేషవిద్య గరపి స్త్రీవిద్యవలని లాభములను ప్రపంచమున కగుపరచవలెనని దృడముగా నిశ్చయించుకొనినవాడు. అందువలన నాతడనేక ప్రయత్నములచే దనసతికి విద్య నేర్పదొడగెను. కాని యా చిన్నది యత్త యాడుబిడ్డల కోడంట్రికముచే నలుగుచుండినందున విశేష విద్యాభ్యాసము చేయలేకుండెను. ఇట్లుండగా నా చిన్నదానికి బదుమూడవయేట నొక కొమారుడు కలిగి తల్లిని స్వర్గమునకంపెను. ఆ చిన్నవానిపేరు కృష్ణా. ఆతడిప్పటివరకును సుఖముగానే యున్నాడు. ప్రథమభార్య చనిపోయినపిదప గోపాలరావు మిగుల నుదాసీనుడయి రెండవ వివాహము చేసికొనను అని నిశ్చయించుకొనెను. ప్రథమపత్ని యున్నకాలములోనే యతనికి మొదట పూనాలో పోస్టాఫీసులో నొకచిన్న జీతము గలపని దొరకి పిదప స్వతంత్రముగా ఠాణాలోని పోస్టుమాష్టరుపని దొరకెను. ఆయన తన ప్రథమపత్నికి గలిగిన కోడంట్రికముం గని చిన్నతనముననే వివాహములుచేసి పిల్లల నత్తవారియింటికి బంపు తల్లిదండ్రులను, పరులపిల్లల నతిక్రూరముగా జూచెడి యత్తలను మిగుల దూషింపుచుండెను. ఇవన్నియు విచారించి యాయన ద్వితీయవివాహము జేసికొనుటకు నిష్టము లేనివాడయి యుండెను. కాని గణపతిరావు అయనవద్దకి వచ్చి తన కొమార్తెను చేసికొనవలసినదని యడుగగా నాతడు తానొక స్త్రీని పూర్ణవిద్యావతిని జేసి ప్రపంచమునకు నుదాహరణము చూపదలచినవాడగుటచే, 'నాభార్యకు నే నెట్టి విద్య గరపినను మీ రడ్డుపడకుండెడి