పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వయసునందుననే మిగుల తెలివిగలదిగానుండెను. అటుపిమ్మట నా చిన్నది యింటిలో నుండిన జెరుపుపనులు చేయునని తల్లి సమీపము నందున్న బాలికాపాఠశాల కామెను బంప దొడగెను. కాని చిన్నతనమువలన నాచిన్నది విద్యాభ్యాసమునందు జిత్తము లేనిదై యుండెను. ఆమెతల్లి బిడ్డలను గొడ్డువలె బాదు మూర్ఖస్త్రీలలోనిది యగుటవలన నామె చిన్నతనమున తల్లి చనువులేక యెప్పుడును శిక్షకు బాత్రురాలగుచుండెను. ఆమె తల్లితల్లియు గణపతిరావుగారి యింటనే ఉండెను. కాన యమున నెవ్వరేమనినను నా ముసలమ్మ వారితో దగవులాడుచుండెను. యమున చిన్నతనమునుండియు నేదోయొక పనిలేక కూర్చుండు స్వభావముగలది గాక, సదా యేదో యొక పనిని చేయుచునే యుండెను. యమున యేడు సంవత్సరములది కాగానే తల్లిదండ్రుల కామె వివాహమును గురించి చింత కలిగెను. వా రనేక స్థలముల వెదకి యనుకూలుడగు వరుని చింతించు నెడ, నొక గృహస్థుడు ఠాణా యను గ్రామమునుండి కల్యాణమునకు వచ్చెను. ఆయనతో గణపతిరావు కొమార్తె వివాహచర్చ తేగా నాయన "ఠాణాలోని పోస్టుమాస్టరుగారి భార్యనివర్తించెను. మీరాయనకడకు వెళ్ళి విచారింపుడ"ని చెప్పెను.

ఆయన చెప్పిననాడు గోపాలవినాయకజోశి సంగమ నేర్‌ఖర్‌గారు. ఈయన తన చిన్నతనములో దన యక్కయు దానును జదువుకొను కాలములో స్త్ర్రీలబుద్ధి పురుషులబుద్ధితో సమానముగా నుండునని తెలిసికొనెను. గోపాలరావుగారికి జిన్నతనముననే ప్రథమ వివాహమాయెను. ఆయన