పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్సవమునం దనేక దానధర్మములు చేసెను. బాలకునకు నామకరణ దివసంబున శివదేవయ్య పూజ్యురాలగురుద్రమదేవి పేరు బాలకున కిడదలచి ప్రతాపరుద్రుడని నామకరణము చేసెను. తదనంతర మా బాలకుడు దినదిన ప్రవర్ధమానుడై శివదేవయ్య వలన సకల విద్యల నభ్యసింపుచుండేను. ఈయన వెనుక ఉమ్మక్కకు మరియొక పుత్రుడు కలిగెను. అతనికి అన్నమదేవుడని పేరిడిరి.

రుద్రమదేవునికి గర్భాష్టకంబున నుపనయనంబు చేసివిద్యలన్నియు నేర్పి రాజ్య మాతనికిమ్మని శివదేవయ్య కొప్పగించి క్రీ.శ.1295 వ సంవత్సరంబున రుద్రమదేవి దివి కరిగెను. ఈమె మన యాంధ్రదేశంబునకు శిరోరత్నమని చెప్పుట కెంత మాత్రమును సందియము లేదు. స్త్రీలలో నిట్టివా రుందురని ప్రత్యక్షప్రమాణమువలన నెరిగియు మనవారు స్త్రీలను హీనముగా జూచుట మిగుల శోచనీయము.


______