పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నెరిగి యామె సైన్యము నంపి వారిని గెలిచి వారి నందరిని హతము గావించెను.

తదనంతర మామె కొన్నిదినములు సుఖముగా రాజ్యము చేసిన పిదప, దేవగిరిరాజు దళములతోడవచ్చి యోరుగంటిని ముట్టడివేసెను. దాని గని రుద్రమదేవి యెంతమాత్రము జంకక, పరమేశ్వరుని దలచి మహారౌద్రముతో పగవారిని ప్రతిఘటించి పోరాడి వారి బలంబుల హీనంబులు గావించె. అంత వారును ముట్టడిని విడిచి, నలుగడలం బలాయితులు కాగా, రుద్రమదేవి వారిని పోనియ్యక దేవగిరి వరకును దరమెను. వారును రుద్రమదేవి శౌర్యమున కత్యంతాశ్చర్యము బొంది, కోటిద్రవ్య మామెకిచ్చి శరణాగతులయి తమదేశమున కరిగిరి. అంత రుద్రమదేవి జయవాద్యములు మ్రోయ తన నగరునకు జనుదెంచి సైనికులకు దగిన బహుమతుల నిచ్చెను.

పిమ్మట నామె కూతురు ఉమ్మక్కకు గర్భచిహ్నములగుపడెను. వానిం గని రుద్రమదేవి యపరిమితానందభరితయై పుంసవనము మొదలగు సంస్కారముల నొనరించి వినోదములతో గాలము గడుపుచుండెను. ఇట్లుండగా ఉమ్మక్కకు పది నెలలు నిండిన పిదప శా.శ. 1166 వ సంవత్సరమగు నందన సంవత్సర చైత్రశుద్ధ గురువారమునా డుదయమున నొకపుత్రు డుదయించెను. రుద్రమదేవి యా బాలకునికి స్నానముచేయించి సింహాసనమునందు బరుండబెట్టి పౌరులను, సామంతులను రాబిలిచి వారందరికిని మీ ప్రభు వితడని తెలిపెను. వారునుమిగుల సంతసించిరి. తదనంతర మామె పుత్రో