పుట:Abaddhala veta revised.pdf/62

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అలా యిటీవల తెలిసిన మత సంఘాలలో డేవిడ్ శాఖ, జిమ్ జోన్స్, డేవిడ్ కొరేష్ రహస్య సామూహిక హత్యలు, ఆత్మహత్యలు సుప్రసిద్ధమైనవి.

మన దేశానికి చెందిన ఎగుమతి ఆధ్యాత్మిక శాఖలు అమెరికాలో కొంత ప్రచారం పొంది, అపఖ్యాతి పాలయ్యాయి. అందులో రజనీష్ ఆశ్రమం ఒకటి. సెక్స్ తో ఆధ్యాత్మికతను రంగరించి, డబ్బు విపరీతంగా సంపాదించి, ఒక వూరునేకొనేసి విమానాలు,కార్లు, అమ్మాయిలతో రభస చేసిన నేరానికి రజనీష్ ను వెళ్ళగొట్టిన ఉదంతం కొందరికి జ్ఞాపకం వుండి వుంటుంది. ఆయన ఇండియావచ్చి పూనాలో చనిపోయాడు.

కృష్ణ చైతన్య అంతర్జాతీయ సంఘం ఒకటి ఇండియాలో పుట్టి అమెరికాలో మెట్టింది. మరొకటి మహేష్ యోగి ఆధ్వర్యాన అలౌకికధ్యానం పేరిట జోరుగా వ్యాపారం సాగిస్తున్నది. డివైన్ లైట్ మిషన్ కూడా భారతీయ ఎగుమతి సంస్థలలో ఒకటి.

మహేష్ యోగి అమెరికాలో బీటిల్స్ సంగీతకారుల్ని, జేన్ ఫాండాను, మియా ఫొరెను ఆకర్షించి,బహుళ ప్రచారం పొందాడు. ఒక రాష్ట్రంలోని కళాశాలనుకొని,దానికి అంతర్జాతీయ విశ్వవిద్యాలయం అని పేరు పెట్టి అలౌకిక యోగవిద్య ప్రత్యేకంగా నేర్పిస్తున్నారు. 1970 ప్రాంతాలలో దాదాపు 10 లక్షల అమెరికన్లను ఆకర్షించిన మహేష్ యోగి రానురాను క్షీణదశలో పడ్డాడు. తనది మతం కాదన్నాడు. తన బోధనలు సృష్టి పూర్వక సైన్స్ గా పేర్కొన్నారు. కాని తగాదాలతో కోర్టుకు వెళ్ళగా మహేష్ యోగి ధ్యానం మతమేనని తీర్పు వచ్చింది. మహేష్ యోగి విధానం మతమేనని తీర్పు వచ్చింది. అదలా వుండగా,మహేష్ యోగి గాలిలో ఎగరడాన్ని తన శిష్యులకు నేర్పినట్లు చాటాడు. ఇది అసత్యమంటూ ఆయన శిష్యుడు కోర్టుకు వెళ్ళగా, 2 లక్షల డాలర్ల జరిమానా మహేష్ యోగి చెల్లించవలసి వచ్చింది. కోర్టు వెలుపల 5 వేల డాలర్లు చెల్లించి, పరిష్కారం చేసుకొని, మహేష్ యోగి బయటపడ్డాడు. మహేష్ యోగి ధ్యానవిద్య వలన కొన్ని ప్రదేశాలలో నేరాలు తగ్గాయని, శాంతి నెలకొన్నదని ప్రచారం చేసుకున్నారు. అది అబద్ధమని అమెరికా సెక్యులర్ హ్యూమనిస్ట్ సంఘం వారు పరిశోధించి వివరంగా తేల్చిచెప్పారు. ప్రస్తుతం మహేష్ యోగి తరచు అమెరికా పత్రికలో విపరీతంగా ఖర్చుపెట్టి, ప్రకటనలు యిచ్చే స్థాయికి దిగజారారు.

హరేకృష్ణ ప్రచారాలు:

భక్తి వేదాంతస్వామి ప్రభుపాద ఇండియాలో స్థాపించి, అమెరికాకు ఎగుమతి చేసిన యీ కృష్ణచైతన్యశాఖ కొందరు అమెరికన్లను ఆకర్షించింది. భగవద్గీత వీరి పవిత్రగ్రంథం. హరేకృష్ణ, హరేరామ అంటూ మంత్రపఠనం చేసే యీ సంఘంవారు సన్యాసత్వం ప్రచారం గావించడం వలన కొందరికే పరిమితమైంది. కొత్తవారిని అట్టే ఆకర్షించలేదు. వీరు అమెరికాలో విమానాశ్రయాలు, ఇతర బహిరంగ ప్రదేశాలలో డబ్బు వసూలు చేస్తున్నారు. ఇది అభ్యంతరకరంగా పరిణమించగా కోర్టువరకూ వెళ్ళింది. కొందరు కృష్ణచైతన్య స్వాముల వద్ద ఆయుధాలు దొరికాయి. ఆధ్యాత్మికతకు