పుట:Abaddhala veta revised.pdf/45

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నేను అమెరికాలో పై విషయాలను ఇంటర్నెట్ లో తెలుగు వారితో చర్చించినప్పుడు, కొందరు భక్తులు ఆగ్రహించారు. అదే వారి సమాధానం. మరికొందరు ఒస్! ఇంతే గదా! సంస్కృతంలో ఇలాంటి శృంగారం మాకు అలవాటే అన్నారు. ఇంకొందరు ఎంతో శృంగారం వుందనుకున్నాం, యీ మాత్రానికే దెప్పిపొడవాలా అన్నారు. చర్చ అలా సాగింది. భక్తుల నుండి అంతకు మించి ఆశించలేని నైతిక విప్లవం కావాలనే వారేమంటారో చూడాలి. ఏమైనా పిల్లల్ని వీటికి దూరంగా వుంచడం అవసరం.

- హేతువాది, ఫిబ్రవరి 2001
చదువుకున్నవారిలోనూ
మూఢనమ్మకాలెందుకుంటాయి?

అంత చదువుకున్న సైంటిస్టు బాబా కాళ్ళకు మొక్కుతున్నారు. కనుక ఏదో మహత్తు వుందన్నమాట అని సాధారణ పౌరులు అనుకోవడం చూస్తున్నాం.

సాంకేతిక నిపుణులు, పవిత్ర గ్రంథాలను పట్టుకొని, పూజలు చేస్తున్నారు. ప్రొఫెసర్లు, సాధువు ఏం చెప్పినా, ఇంటిలో విగ్రహారాధన, బయట మొక్కుబడులు చేస్తున్నారు.

ఈ విధంగా చదువుకున్నవారు మూఢనమ్మకాలను పాటిస్తుండటం వలన ప్రజలలో యింకా వాటికి బలం పెరుగుతోంది.

రాజకీయవాదులు, సినిమాతారలు, జడ్జీలు, పోలిస్ అధికారులు తిరుపతి, షిర్డి, అయ్యప్ప భక్తులుగా, బాబా పాదాక్రాంతులుగా ప్రవర్తించడంతో అదంతా ఆనవాయితీగా ప్రశ్నించరాని తీరుగా మారుతోంది.

చదువుకున్నవారు మూఢవిశ్వాసాలతో వుండడం మన సమాజానికే పరిమితం కాదు. అగ్రరాజ్యమైన అమెరికా మొదలు కమ్యూనిష్టు దేశాలవరకూ యీ మూఢత్వం వివిధ రూపాలలో వ్యాపించి అంటురోగం వలె ప్రబలుతున్నది.

కొందరు కొన్నిటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేసి మరికొన్నిటిని గుడ్డిగా నమ్ముతున్నారు.

మనకు అనుకూలమైన విషయంలో మనకు గిట్టుబాటు అయినచోట, సంపాదనకు ఉపకరించే దగ్గర, శాస్త్రీయ పరిశీలన పక్కనబెట్టి, హాయిగా మూఢనమ్మకాన్ని పాటిస్తున్నారు. మిగిలిన విషయాలపై వేదికలెక్కి మూఢనమ్మకాలను ఖండించే వారే, యిలా అవకాశవాదులుగా మారడంతో ప్రజలలో విశ్వాసం సడలుతున్నది.

ఇలా ఎందుకు జరుగుతున్నది? ఈ విషయం సునిశితమైనది. జాగ్రత్తగా పరిశీలించి