పుట:Abaddhala veta revised.pdf/434

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

బెనర్జిని ఇండియాలో అరెస్ట్ చేశారు. అతడివన్నీ కట్టుకథలని తేలింది. యు.జి.సి. వారు కూడా కొంత నిధిని సమకూర్చి తరువాత నాలుక కొరుక్కున్నారు. అమెరికాలో అతడు ఓక్లొహామా రాష్ట్రంలో షోఫెన్ బర్గ్ రీసెర్చి ఫౌండేషన్ పెట్టి మూసేశాడు.

పూర్వజన్మలే గాక, రానున్న జన్మలు కూడా చెప్పడం మామూలే. ప్యూచరాలజీ పేర వీరు చెప్పేవన్నీ కొన్ని వందల వేల ఏళ్ళ అనంతరం జరుగుతాయంటున్నారు. కనుక రుజువుకు నిలబడవు.

గత జన్మల విషయం సాధారణంగా గుర్తుండవంటారు. ఎక్కడో కొందరు గుర్తున్నాయన్నప్పుడు, సంచలనం జరిగింది. ఇండియాలో యిలాంటివి అప్పుడప్పుడు ప్రచారంలోకి వచ్చాయి.

కృష్ణుడికి గతజన్మలన్నీ గుర్తున్నాయట. బౌద్ధులకు గత జన్మలు తెలుస్తాయని టిబెట్ లో నమ్ముతారు. అనిబిసెంట్ తన గత జన్మల గురించి చెప్పింది. జన్మలలో తేడా వచ్చినప్పుడు ఏమీ సంజాయిషీ వుండదు. అయితే యివేవీ రుజువులకు నిలబడవు.

సాయిబాబా: సాయిబాబా అతీంద్రియ శక్తులు, నిర్ణయాలు అంగీకరించిన స్టీవెన్సన్ గురించి రాస్తూ పరిశోధనకు, రుజువుకు నిలబడక పోవడాన్ని ప్రస్తావించారు. గాలిలో నుండి చేయి చాపి వస్తువుల్ని సృష్టించగలిగితే, కొన్ని భౌతిక సూత్రాల్ని అధిగమించి పోయినట్లవుతుందన్నారు. అది conservation principleకు దాటిపోయినందున సైన్స్ లో గొప్ప విషయం అవుతుందనీ, ఆయన ప్రతిష్ట యినుమడిస్తుందనీ, కనుక రుజువుకు అంగీకరిస్తే బాగుంటుందన్నారు. సాయిబాబాను పరీక్షించడానికి శాస్త్రజ్ఞులు, మాంత్రికులు (Magicians) తగిన వారన్నారు.

మద్రాసు క్రిస్టియన్ కాలేజిలో రిటైర్ అయిన సి.టి.కె. చారి అతీంద్రియ శక్తులు గురించి చాలా రాశారు. చిన్న పిల్లల పునర్జన్మల గురించిన విషయాలు పచ్చి కట్టు కథలని ఆయన రాశారు.

దేవుడు నిర్వికారుడు, సర్వాంతర్యామి అనే వాదనను చూస్తే అలాంటి దేవుడికీ, మనుషులకూ, ప్రపంచానికి ఎలా సంబంధం వుంటుందో అడిగారు. మనుషుల ప్రార్థనలు అలాంటి దేవుడికి ఎలా వినిపిస్తాయని అడిగారు. ఒకవేళ వింటే,తన శక్తిని యీ ప్రపంచంలోకి ఎలా పంపిస్తాడని తెలుసుకోవాలన్నారు. కేవలం మనస్సు (Pure Mind) భౌతిక ప్రపంచంతో ఎలా సంబంధం పెట్టుకుంటుందనేది అవగాహన కానిది.

ఒకే ఆకారం లేదా శరీరం రెండు చోట్ల వుండడం, పరకాయ ప్రవేశం, రెండు జన్మల మధ్య ఆత్మ నిరాకారంగా తిరగడం, ముసలివాడుగా చనిపోయి, పిల్లల్లో పుట్టడం యిలాంటివన్నీ రచయిత చర్చించారు. మరోజన్మలో పునర్జన్మ సిద్ధాంతానికి విరుద్ధంగా 5 వాదనలు ఉన్నాయి. పరిణామ సిద్ధాంతం పునర్జన్మని తృణీకరిస్తుందని చూపారు. బిగ్ బాంగ్ తరువాత చాలాకాలం