పుట:Abaddhala veta revised.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అణువులు, రేణువులు, వరమాణువులు, నిరంతరం చలనంలో వుంటాయి. అది మనం కంటితో చూడలేం. న్యూక్లియస్, ఎలక్ట్రాన్లు, అణువులు కదులుతూనే వుంటాయి. ఘన, ద్రవపదార్ధాలలోని అణువులు నిరంతరం కదులుతూనే వుంటాయి. వాయు పదార్ధాలలో ఇక చెప్పనక్కరలేదు.

కదలకుండా వున్నట్లు కనిపించే లోహాలలో గంటకు 20 లక్షల మైళ్ళ వేగంతో ఎలక్ట్రాన్లు చలిస్తుంటాయి!

వైరస్ అంటే

వైరస్ వల్ల ఫ్లూ, ఆటలమ్మ,మసూచి వంటి తీవ్ర జబ్బులు వస్తాయి.

సూక్ష్మజీవిలో పదోవంతు పరిమాణం వుండే వైరస్ ప్రాణి కాదు. పెద్ద జీవాణువుల చుట్టూ వుండే ప్రొటీన్ వంటివి. జీవాణువుతో వైరస్ తారసిల్లినప్పుడు కణాల ఉత్పత్తి విధానం వైరస్ లో ఏర్పడి ఇతర కణాలకు ప్రాకుతుంది.

సూక్ష్మక్రిముల వలన టైఫాయిడ్, క్షయ, న్యుమోనియా, కోరింతదగ్గు, సిఫిలిస్, గనేరియా, కుష్టు, ధనుర్వాతం వస్తాయి.

వైరస్ కూ బాక్టీరియాకు యీ తేడా వుందని గ్రహించాలి.

సూక్ష్మకణాలు:(జీవాణువులు)

సూక్ష్మకణాలు కంటికి కనిపించవు. అయినా ఒక్కొక్క జీవకణంలో 200 బిలియన్ అతిసూక్ష్మ కణాలు (మాలెక్యూల్స్) వుంటాయి. అంగనిర్మాణానికి యివి సాధనాలు.

జీవకణాలు శక్తినిస్తాయి. ఇవి ఎమినోయాసిడ్స్ నుంచి ప్రొటీన్లు తయారుచేస్తాయి. జీవకణాల్ని విభజించి, మరిన్ని జీవకణాల్ని రూపొందిస్తాయి.

అన్ని జీవులకూ, ప్రాణానికీ ఆధారం జీవాణువులే (డై ఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్- డి.ఎన్.ఏ.)

జీవాణువును విప్పిచూస్తే నిచ్చెన మెట్ల వలె కనిపిస్తుంది. అందులో రెండు జతల కలయికతో నాలుగు రసాయన పదార్ధాలుంటాయి. అడినైన్, తైమైన్, గానైన్, సైటోసైన్ అనే కోడ్ వరుసనే జన్యువు(జీవి) అంటాం. ఇందులో అడినైన్, థైమన్ ఒక జతగా, గానైన్, సైటోసైన్ మరో జతగా కలుస్తాయి. వివిధ ప్రొటీన్లకు వీటి కలయిక ఉపకరిస్తుంది.

జీవాణువుల రహస్యం

జీవాణువుల సంకేతాలు విప్పుకుంటే రహస్య సంకేతం గ్రహింపవచ్చు. నాలుగు