పుట:Abaddhala veta revised.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జీవాణువులు తగిన రీతిలో కలసి, అచ్చుగుద్దినట్లుగా రూపొందుతాయి. అణువు నిభజించుకొనే ముందు తగిన రీతిలో రూపొందే కొత్త అణువుకు తగ్గట్లు సిద్ధమౌతుంది. ప్రొటీన్ తయారు గావడానికి ఒక జన్యు అణువు విప్పుకొని, తాత్కాలిక నమూనా రూపొందుతుంది.

మనిషిలో జన్యు అణువు ఎంజైం కు తారసిల్లినప్పుడు, ఇన్సులిన్ తయారయ్యేట్లగా జన్యు అణువును తెగగొడుతుంది. జన్యు అణువుల స్రవంతిలో ఇన్సులిన్ జొప్పించే తీరులో ఇతర ఎంజైం లు చిన్న పేగులలోని సూక్ష్మజీవులతో కలుస్తాయి.

ఇకోలి లక్షలాదిగా తనను పోలిన జీవణావులను తయారుచేసుకుంటుంది. అమినో యాసిడ్ అణువుల్ని ఇన్సులిన్ గా తయారుచేయడం ఆశ్చర్యకరంగా సాగుతుంది.

సూక్ష్మ అణువుల అనంతశక్తి

పరమాణువుల ప్రవర్తన జాగ్రత్తగా పరిశీలిస్తే, గురుత్వాకర్షణ శక్తి భారం వలన యివి మూడు విచిత్ర కలయికల్ని రూపొందిస్తున్నట్లు తెలుసుకున్నారు. అందులో పల్సార్(న్యూట్రాన్ నక్షత్రం) ఒకటి. కాగా, బ్లాక్ హోల్ మరొకటి. ఈ రెండూగాక, వైట్ డ్వార్ఫ్ మరొకటి. సూక్ష్మాణువుల మధ్యగల ఖాళీప్రదేశాన్ని కోల్పోవడం వల్ల యివి ఏర్పడడం ఆశ్చర్యకరంగా వుంటుంది.

వైట్ డ్వార్ఫ్ లో సాంద్రత ఉక్కుకంటే 10 వేల రెట్లు ఉంటుంది. ఒక చంచా బరువు 10 టన్నులు వైట్ డ్వార్ఫ్ లో వుంటుంది. సూర్యుని వంటి నక్షత్రం తగులబడి, అణగిపోగా యిది జరుగుతుంది.

సూర్యునికంటె 1.4 రెట్ల సాంద్రతగల తార అణగారిపోతే, దాని గురుత్వాకర్షణ శక్తిని అందులోని ఎలక్ట్రాన్లు ఏ మాత్రం అడ్డుకోలేవు. ప్రొటాన్లు న్యూక్లియస్ తో మిళితమై అణగిపోతాయి. ఘనపు సెంటీమీటర్ పరిణామం 10 మిలియన్ టన్నుల బరువు వుంటుంది. ఆ న్యూట్రాన్ తారలు తిరుగుతూ రేడియో పల్స్ విడుదలచేస్తాయి.

బ్లాక్ హోల్

సూర్యుడికంటె మూడు రెట్లున్న నక్షత్రంలో గురుత్వాకర్షణశక్తి న్యూట్రాన్ తారకూడా ఆపలేనంతగా వుంటుంది. అలాంటి గురుత్వాకర్షణ పదార్ధన్నంతటినీ అనంత సొరంగంలోకి లాగేస్తుంది. అందులో నుండి వెలుతురుకు సైతం తప్పించుకొనే దారిలేదు!

బ్లాక్ హోల్ లో భూమి అంత పదార్ధం ఒక ముత్యపు పరిమాణంలో వుంటుంది. మొత్తం పరిమాణం అనూహ్యం.

- హేతువాది, నవంబరు 1995