పుట:Abaddhala veta revised.pdf/295

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వెల్లడౌతాయి. ఇందులో సంఘపరమైనవి కొన్ని వున్నాయి. కాని, జబ్బువలె సూచనలు వెల్లడించడం ఎందుకంటే, జనానికి మరో విధంగా వాటిని తెలిపే రీతులు అలవాటు కాలేదు గనుక!

ఫ్రాయిడ్ వియన్నా నుండి పారిస్ వెళ్ళి చార్ కాట్ వద్ద హిప్నాటిజం నేర్చి, హిస్టీరియా జబ్బేనని ప్రకటించేశాడు. అయితే రోగుల చరిత్ర తెలిసినప్పుడు, వారు రోగులు కాదని, రోగ సంబంధమైన బాధలుగాక, కుటుంబ సామాజిక బాధలే వున్నాయని ఫ్రాయిడ్ గ్రహించాడు. బంధువులను, భాగ్యాలను పోగొట్టుకున్న ఒక అమ్మాయి 18 మాసాలపాటు ఒంటరితనం అనుభవించడం ఫ్రాయిడ్ కు బాగా తెలుసు. అలాగే తరచు కాళ్ళనొప్పులని ఫిర్యాదుచేసిన మరొక ఆమెను కూడా హిస్టీరియారోగిగా ఫ్రాయిడ్ పేర్కొన్నాడు. ఆ రోగులకు శారీరిక జబ్బుల లక్షణాలు లేవు. తమ లక్షణాలను మరొక తీరుగా మార్చి చెప్పుకుంటారని ఫ్రాయిడ్ నమ్మాడు. లైంగిక సంబంధమైన అసంతృప్తిని శారీరిక బాధలుగా చూపడం ఒక తీరన్నమాట. మానసిక ప్రవర్తనను శారీరిక ప్రవర్తనగా మార్చి ఫ్రాయిడ్ చూపాడు. ఇందులో పరిశోధన ఏ మాత్రం చేయలేదు. 1895లో హిస్టీరియా గురించి ఫ్రాయిడ్ రాసిన నాటికి, ఇంకా సిఫిలిస్ కనుగొనడానికి వాసర్ మన్ పరీక్ష రాలేదు. అందుకని మనస్సు అనేమాట అడ్డం పెట్టుకొని ఫ్రాయిడ్ ప్రచారం చేశాడు. ఇలా సిద్ధాంతీకరించేవారికి ఆనాడు పేరుప్రతిష్ఠలు జనబాహుళ్యంలో త్వరగా వ్యాపించేవి. తెలిసీ తెలియని డాక్టర్లు వీటిని అనుకరించేవారు. ఫ్రాయిడ్ పై కోఎనాలసిన్ కు శాస్త్రీయాధారాలు లేవు. మానసికచికిత్స పేరిట వీరు ప్రచారంలోకి వచ్చారు. మనస్సు శరీరాన్ని ప్రభావితం చేస్తుందనే వీరి సిద్ధాంతంలో ప్రధాన లోపం ఏమంటే,మెదడును మనస్సుగా చిత్రించడం వీరు పేర్కొనే మానసిక లక్షణాలు పరిశోధన పరిధిలోకి రావు. మెదడు శరీరంలో భాగం. అది పరిశోధనలోకి వస్తుంది.

- హేతువాది, అక్టోబరు 1991

కనుకట్టు - సమ్మోహనం గుట్టు

మెస్మరిజం - అసలు వాస్తవాలు

మెస్మరిజం అనే మాట బహుళ ప్రచారం పొందింది. మన సినిమాలలో, వైద్యంలో, వూళ్ళల్లో, ఎన్నో నోళ్ళల్లో మెస్మరిజం అనేమాట వింటుంటాం. అయినా మెస్మరిజం లోతుపాతులు చాలామంది తెలుచుకోకుండానే యీ మాట ప్రభావానికి లోనుగావడం మన అలవాట్ల బానిసత్వాన్ని సూచిస్తుంది. కనుక నిజానిజాలు విడమరచి చూద్దాం.

ఫ్రాంజ్ ఏంటన్ మెస్మర్(1733-1815) ఆస్ట్రియా దేశవాసి. కాన్ స్టన్స్ సరస్సు ఒడ్డున చిన్న ఆస్ట్రియా నగరం - 1733 మే 23న ఇజ్నార్ లో పుట్టాడు. వైద్యం అభ్యసించక ముందు దైవశాస్త్రం చదివాడు. 1766 నాటికి వైద్యంలో కూడా డాక్టరేట్ పుచ్చుకున్నాడు. గ్రహాలు మానవుడిపై ఎలా