పుట:Abaddhala veta revised.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభావం చూపుతాయనే విషయమై సిద్ధాంతం వ్రాసి డిగ్రీ స్వీకరించాడు. 1768లో మెస్మర్ ఒక భాగ్యశాలి అయిన విధవను వివాహమాడాడు. సాంస్కృతిక జీవనంలో కళలు ఆస్వాదించి, అనుభవిస్తూ జీవితం గడిపాడు. అయినా విలాసాలతో వృధా చేయక, జ్ఞానార్జనకు కృషిచేశాడు.

ఆనాడు యూరప్ లో కొత్తగా బహుళ ప్రచారం పొందుతున్న అయస్కాంతంలో చికిత్సపట్ల మెస్మర్ ఆకర్షితుడయ్యాడు. మరియా తెరిసా కొలువులో జ్యోతిష్యుడుగా మాక్సి మిలియన్ హెల్ అనే జెసూట్ ఫాదరీ అయస్కాంతంలో వైద్యం చేస్తుండేవాడు. ఇది 1774 నాటిమాట. మొదట్లో నీటితో వైద్యం చేస్తుండే ఫాదరీ, క్రమేణా అయస్కాంత రాళ్ళు వాడాడు. ఒక సాంకేతిక నిపుణుడి సాయంతో భిన్న ఆకారాలు గల అయస్కాంత రాళ్ళు వాడాడు. ఒక సాంకేతిక నిపుణుడి సాయంతో భిన్న ఆకారాలు గల ఆయస్కాంత రాళ్ళు అతడు తయారుచేస్తుండేవాడు. రోగి శరీరంలో రుగ్మత వున్నచోట యీ అయస్కాంతరాళ్ళు పెట్టేవాడు. వియన్నా వైద్యసంఘం యీ విషయమై అతడిని పట్టించుకోలేదు. 1774 వేసవిలో వియన్నాకు వచ్చిన విదేశస్తుడు తన భార్యకు అయస్కాంత వైద్యచికిత్స చేయమని కోరాడు. హెల్ నుండి ఇదంతా మెస్మర్ నేర్చాడు. మానసిక చికిత్స కూడా హెల్ ముందుగా మెస్మర్ కు చెప్పాడు. సంసపన్న స్త్రీకి తాను ఎలా చికిత్స చేస్తున్నదీ హెల్ ఎప్పటికప్పుడు మెస్మర్ కు తెలియజేసేవాడు. కొన్నాళ్ళకు ఆ స్త్రీకి నయమైనట్లు మెస్మర్ స్వయంగా తెలుసుకొని అయస్కాంతచికిత్స పట్ల ఆకర్షితుడయ్యాడు.

1774-1776 అయస్కాంత చికిత్సలు చేసిన మెస్మర్, విశ్వవ్యాప్తంగా ద్రవపదార్ధం వుంటుందని నమ్మాడు. అదే అయస్కాంత ప్రభావానికి మూలం అనుకున్నాడు. అయస్కాంతం కేవలం కొన్ని అంగుళాల మేరకే ప్రభావం చూపుతుందని మెస్మర్ కు తెలుసు. కనుక అయస్కాంతంలో దాగివున్న శక్తులు వున్నాయని,అవే రోగాన్ని నయం చేస్తున్నాయని విశ్వసించాడు. రోగం వున్నదని భ్రమించి వచ్చే రోగులపై మెస్మర్ చికిత్స బాగా పనిచేసింది. అయస్కాంత రాళ్ళు సర్వాంతర్యామి శక్తిలో భాగం అని మెస్మర్ నమ్మిన తరువాత, నీటిని ఆ రాళ్ళతో అయాస్కాంతీకరణ గావించి రోగులచేత తాగించేవాడు. పింగాణి కప్పులు, పళ్ళాలు, బట్టలు, పరుపులు, అద్దాలు అయస్కాంతీకరణ చేసేవాడు. విద్యుత్ వలె అయస్కాంత ద్రవం కూడా అట్టిపెట్టి, ఇతర వస్తువులకు అందించవచ్చని మెస్మర్ భావన. పెద్ద తొట్లు తయారుచేసి అందులో రెండు వరసల సీసాలు అమర్చి, వాటి మూతలకు బెజ్జాలు పెట్టి, వాటి నుండి ఇనుపచువ్వలు పైకి వచ్చేటట్లు చేసి, రోగులను ఆ ఇనుపచువ్వలను తాకమనేవాడు. సామూహికంగా రోగులు తొట్టిలో కూర్చొని యీ చికిత్స పొందేవారు. ఒకరి చేతులు మరొకరు పట్టుకొని కూర్చుంటే అయస్కాంతం ఒకరి నుండి మరొకరికి ప్రాకుతుందని మెస్మర్ నమ్మించాడు.

మెస్మర్ పలుకుబడి, కీర్తి ఆనోటా ఆనోటా పడి బాగా వ్యాపించగా రానురాను అయస్కాంత రాళ్ళతో పనిలేదని, తన వ్యక్తిత్వ ప్రభావంతో చికిత్స చేయవచ్చని మెస్మర్ గ్రహించాడు. లోగడ ఎవరికైనా నయమైందంటే అది తన వ్యక్తి ఆకర్షణ ప్రభావం వల్లనేనని కూడా అతను గ్రహించాడు. తానే ఒక అయస్కాంతం అని మెస్మర్ ఊహించాడు. 1776 నుండి