పుట:Abaddhala veta revised.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వుంచాలన్నారు. అప్పటికే ముదిరిపోయింది. దేశంలో మూఢనమ్మకాలకు, అశాస్త్రీయ ధోరణులకు గాంధి గట్టి పునాదులు వేశారు.

భవిష్యత్తు బాగా వుండాలని కోరుకునే వారు గాంధీ జీవితాన్ని శాస్త్రీయంగా పరిశీలించాలి. చరిత్రను సైంటిఫిక్ గా రాయాలని ఎం.ఎన్.రాయ్ కోరాడు. అందుకు భిన్నంగా గాంధీ స్వీయగాధలు, రచనలు వున్నాయి. పరిశోధకులు సత్యాన్వేషణకు పూనుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయి. ఈశ్వర-అల్లా తేరేనాం అంటూ గాంధీ జయంతులలో టోపీలు పెట్టుకొని సమాధికి పూలుచల్లుతూ, భజన చేసినంత కాలం "సత్యాన్వేషణ" జరగదు. వీరారాధనలో ఆలోచన వుండదు.

గాంధీకి చరిత్రలో ఏ మేరకు గౌరవ స్థానం యివ్వాలి అనేదికూడా శాస్త్రీయ పరిశీలకులు నిర్ధారించాలి. స్వాతంత్ర పోరాటంలో ఆయనకు సముచిత స్థానం యివ్వడానికీ మిగిలిన విషయాలలో పాటించడానికీ తేడా గ్రహించాలి.

- హేతువాది, నవంబర్ 1993
శాస్త్రవేత్త గెలీలియోను హతమార్చిన తీరు!

భూమి చుట్టూ గ్రహాలు, గోళాలు, తారలు తిరుగుతాయని మత శాస్త్రాలు చాలాకాలం నమ్మించాయి. పవిత్ర గ్రంథాలలో అలా రాసుకొని జనాన్ని అనుసరించమన్నారు టాలమీ అలాగే రాశాడు.

పరిశీలన, పరిశోధన వచ్చి మతభావాల్ని కాదంటూ అసలు విషయాన్ని వున్నది వున్నట్లు బయటపెట్టాయి. కోపర్నికస్ 1543లో సూర్యుడు కేంద్రం అనీ, భూమి కాదని రాసి చనిపోయాడు. అంతటితో అప్పటి వరకూ టాలమీ(క్రీ.శ.150) రాసిన భూకేంద్ర సిద్ధాంతం తలక్రిందులు చేయాల్సి వచ్చింది. భూమి స్థిరంగా, కదలించడానికి వీలు లేకుండా వుంటుందని బైబిల్ చెప్పింది. క్రైస్తవులు అలాగే నమ్మారు.(సాం 93)

కెప్లర్ వచ్చి సూర్యుడు కేంద్రం అన్నాడు. అతడు గెలీలియో సమకాలీనుడే!

గెలీలియో ఇటలీలో పుట్టి పెరిగి చదువుకున్నాడు. అతడి మిత్రుడే మఫె బార్బెరిని(Maffew Barberini) . ఇద్దరూ ఇటలీ పీసా యూనివర్శిటీలో చదువుకున్నారు. మిత్రులుగా ఎదిగారు. కాగా మత వ్యవస్థలో బాగా పలుకుబడి, ధనం గల కుటుంబం నుండి వచ్చిన బార్బెరిని కార్డినల్ గా తరువాత పోప్ గా ఎన్నికయ్యాడు. 55 సంవత్సరాల ప్రాయంలో పోప్ గా అతడు 8వ ఆర్బన్ అని నామకరణం చేసుకున్నాడు.

గెలీలియో తన పరిశోధనా రచన : డైలాగ్ ని(Dialogue) కేథలిక్ మత సెన్సార్ వారికి