పుట:Abaddhala veta revised.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రూ.150లు ఫీజు చెల్లించాలి. మొత్తం 700ల మంది విద్యార్థులుంటే అర్హత వున్నా లేకున్నా 200ల మంది ప్రొఫెసర్లున్నారు;

ఆశ్రమంలో నళినీకాంత గుప్త అని మరొకరున్నారు. కొందరు వారికి అతిగౌరవం యిస్తున్నారు. మరికొందరు పాదస్పర్శ చెస్తున్నారు. ఏమిటి విశేషం అని విచారించగా, మాత అనంతరం ఆయనే సీనియర్ అని తెలిసింది. అంటే రంగం సిద్ధం చేసే వుంచారన్నమాట అనుకొన్నాం.

ఆశ్రమంలో అంతా డబ్బుతో కూడిన వ్యవహారమే. అక్కడికి వచ్చిన వారు అక్కడే భోజనం చెయ్యాలన్నారు. మాలో కొందరు ఆ భోజనం చెయ్యలేకపోయారు. మమ్మల్ని అక్కడే భోజనం చేయమన్న మా ప్రొఫెసర్ మాత్రం స్వగృహంలో విందారగించారు. విద్యార్థులు మాత్రం అరువాత ఊళ్ళోకి వెళ్ళి హోటల్లో తినవలసివచ్చింది. కాని అక్కడ మరో విశేషం జరిగింది. వూళ్ళోవాళ్ళు మమ్మల్ని చూచి, వెక్కిరిస్తూ మాట్లాడారు. ఆశ్రమానికి వచ్చారా అని వెటకారంగా అన్నారు. తీరా విచారిస్తే, ఊళ్ళోవారికి ఆశ్రమం అంటే చాలా ఆగ్రహం వున్నదని, ఆశ్రమానికి స్థానికులకు షష్ఠాష్టకం అని తేలింది. మేము వారం రోజులుంటే ఆశ్రమంలో తమిళవాసన ఎక్కడా కనిపించలేదు. బెంగాలీలు, గుజరాతీలు, కొంత ఫ్రెంచి ప్రభావం మాత్రం గోచరించింది.

అంతా వ్యాపారమయం:

అరవిందాశ్రమం కొన్ని వ్యాపారసంస్థల్ని నడుపుతున్నది. వాటిలో కొన్నిటిని సందర్శించాం. అక్కడ పనిచేసేవారిని కలసి మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకొని ఆశ్చర్యపొయాం. భక్తులు ప్రచారం చేసేదానికి, వాస్తవానికీ గల అఖాతం అర్థమైంది.

ఆశ్రమంలో జింక్ షీట్లు తయారుచెసే పరిశ్రమ మొదలు-ప్రింటింగ్ ప్రెస్ వరకూ అనేక వ్యాపారాలున్నవి. వారిలో కొందరు వడ్రంగులను, మెకానిక్ లను, ప్రెస్ కార్మికులను ఇంటర్వ్యూ చేశాం. బయట యిచ్చే వేతనాల కంటె యిక్కడ తక్కువ యిస్తున్నారని తెలిసింది. 1956లోనే ఆశ్రమంలో కార్మికులు సమ్మెచేశారని చెప్పారు. దీన్ని బట్టి ఆధ్యాత్మికత పేరిట ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో అనుభవించినవారు చెబితేగాని అర్థంకాదు. ఈ విధంగా ఆశ్రమంలో పనిచేస్తున్నవారికి అక్కడ జరిగే పనులపై గౌరవం గాని, వ్యక్తులపై అభిమానం గాని లేదంటే ఆశ్రమ పెద్దలలో తీవ్రలోపం వున్నదన్న మాటే. ఇన్ని దశాబ్దాలు గడిచినా స్థానికుల అభిమానం చూరగొనలేదంటే రోజురోజుకూ ఆ లోపం పెరుగుతున్నదన్నమాట. అందుకే హిందీ వ్యతిరేకోద్యమ సందర్భంగానూ, అరవిందుని పేరిట కేంద్ర విశ్వవిద్యాలయం అక్కడ స్థాపించాలన్నపుడూ స్థానికులు వ్యతిరేకించారు. ఆశ్రమంపై దండెత్తారు కూడా.

విద్యార్థినీ విద్యార్థులను కొందరిని కలిసి మాట్లాడాం. వారికి మాత అన్నా ఆశ్రమం అన్నా చాలా చులకనభావం వున్నదని అర్థమైంది. తల్లిదండ్రులు భక్తులు గావటంలో వారు తప్పనిసరిగా