పుట:Abaddhala veta revised.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రతివారూ మాతవద్ద మోకరిల్లి, ప్రణమిల్లాలి, మాతను ప్రశ్నలు అడగరాదు. మాత యిచ్చే పుష్పం స్వీకరించాలి. మాత చూసినంతసేపూ ఆమె కళ్ళలోకే చూడాలి. కళ్ళ ద్వారా ఆమె తన శక్తిని ప్రసరింపజేస్తుంది. నిశ్శబ్దంగా వుండాలి ఇత్యాదులన్నీ చెప్పాడు.

దర్శనానికి పెద్ద క్యూ వున్నది. భక్తుల్లో తగిన మానసిక వాతావరణం ఏర్పరచే నిమిత్తం కొన్ని చిట్కాలు ప్రయోగించారు. ఒక్కొక్క గదిలో కొంచెంసేపు ఆపి, కూర్చోబెట్టి, ఎవరో ఒకరు వచ్చి అరవిందులు - మాత ఆయా గదులలో ఎట్లా గడిపారో వివరించేవారు ఇట్లా దర్శనానికి ముందు ఒకగంటసేపు సస్పెన్స్ వాతావరణం సృష్టించారు.

కృత్రిమ వాతావరణం:

తీరా మాత గదిలో ప్రవేశించి చూద్దుంగదా, కురువృద్ధురాలు వణకుతున్నది. మాటలో స్పష్టత లేదు. పక్క ట్రేలో కొన్ని పూలు పెట్టారు. రంగు రంగుల కలాలు వుంచారు. వెళ్ళినవారు ఒకరి తరువాత ఒకరు తొదుగులు ధరించిన ఆమె పాదాలను స్పృశించారు. దండం పెట్టారు. కళ్ళలోకి చూశారు. ఇచ్చిన పుష్పం స్వీకరించారు. కాని మా ముఠాలో ఆమెపైన నమ్మకం లేనివారూ, పాదాలు తాకటం యిష్టంలేనివారు, నటించటం చేతకాని వారూ వున్నారు. ఏమి చేయాలో తోచని సందిగ్ధావస్థలో పడ్డారు వారు. ఇటు చూస్తే శాఖాధిపతి అనుగ్రహం పోతుందేమో! అటు అయిష్టమైన ఆచారాలు, అట్లాంటప్పుడు వారికి ధైర్యం చెప్పి నన్ననుసరించమన్నాను. దగ్గరకు వెళ్ళి పెద్దలకు పెట్టినట్లే నమస్కరించాం. ఆమె ప్రతి నమస్కారం చెయ్యలేదు. కళ్ళలోకి చూసే తతంగం చేయలేదు. నాతో పాటున్న కొందరు అదే విధంగా బ్రతుకు జీవుడా అని బయటపడ్డారు. మాతోపాటు వచ్చిన వారిలో మధుసూధనరెడ్డి గారి అన్న మాత్రం మాత కాళ్ళు పట్టుకుని వలవల ఏడ్చాడు. మాకు నవ్వొచ్చింది. బలవంతంగా ఆపుకున్నాం. మొత్తం మీద కృత్రిమంగానూ అసహ్యంగానూ వున్న ఆ వాతావరణం నుండి బయటపడ్డాం.

పేరుకు అన్నీ అంతర్జాతీయాలే:

ఇక ఆశ్రమం, అందలి విశేషాలు తిలకించటానికి పూనుకున్నాం. ముందుగా అంతర్జాతీయ స్కూలు పేరిట వున్న సంస్థకు వెళ్ళాం. జుగల్ దా అనే ఒకాయన ఉపన్యాసం ఏర్పాటుచేశారు మా కోసం. ఆయన మాట్లాడబోయి యెందుకో వెక్కివెక్కి ఏడ్చాడు. ఎందుకో తెలియదు. మళ్ళీ నవ్వు ఆగలేదు. అందులో కారణం తెలియకుండా మగాళ్ళు ఏడుస్తుంటే నవ్వురాదా మరి! మాత జ్ఞాపకానికి వచ్చింది ఏడ్చానన్నాడాయన! అదొక ఫార్సు అనిపించింది. స్కూలంతా తిరిగి చూశాం. అది సంపన్నుల పిల్లలకే తప్ప మరెవరికి అందుబాటులో లేని స్కూలు. దాన్నెవరూ గుర్తించలేదు. అక్కడ చదువు ముగుసిన తరువాత ఏమి చెయ్యలో వారికే తెలియదు. పైగా చదువులో చెప్పుకోదగిన విశేషాలు, ఇతర చోట్ల లేనివి, అక్కడేమీలేవు. నెలకు విద్యార్థి ఒక్కొక్కరూ