పుట:Abaddhala veta revised.pdf/125

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చేయించినా, అంటరానితనం వరకూ తీర్మానాలకే పరిమితం చేశారు. తిలక్ స్వరాజ్యనిధి వసూళ్ళుచేసి, నిర్మాణ కార్యక్రమం సాగించి, అంటరానితనం నిర్మూలనకు ఉపక్రమించారు. గాంధీజీ విజ్ఞప్తి మేరకు ప్రజలు 1921 లోనే 30 లక్షల రూపాయల నిధి యిచ్చారు. అంటరానితనం నిర్మూలనకు ఎంత ఖర్చు చేసారయ్యా అంటే 43 వేలు మాత్రమే. గాంధీజీ ఈ విషయమై ఏమీ అనలేదు.

అంటరానివారికి ప్రత్యేక ప్రాతినిధ్యం వుండాలని అంబేద్కర్ కోరారు. బ్రిటిష్ పాలకులు అంగీకరించారు. ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిధ్యం అంగీకరించిన గాంధీజీ, అంటరానివారికి ప్రత్యేక ప్రాతినిధ్యం వుండాలంటే ఆమరణ నిరాహారదీక్ష పూనారు. అంటరానివారు శతాబ్దాలుగా ఎలా వుంటున్నా సరే, వారు బాగుపడక పోయినాసరే, గాంధీజీ ప్రాణం విలువైంది గనుక, ఆయన్ను బ్రతికించుకోవాలన్నారు. అంబేద్కర్ పై వత్తిడి తెచ్చి, బలవంతంగా ఆయనచేత ప్రత్యేక ప్రాతినిధ్యం కొరకు పట్టుబట్టనని ఒప్పించారు. అంటే గాంధీజీ కోరినట్లు అంటరానివారు హిందువులలో భాగంగా అలాగే అణిగిమణిగి పడివుండేటట్లు పూనా ఒడంబడిక చేసిందన్నమాట. అంబేద్కర్ ను ఓడించి, గాంధీ నెగ్గి, అంటరానివారిని చాలా అన్యాయాలకు గురిచేశారు.

కేరళలోని గురువాయూర్ దేవాలయంలో అంటరానివారికి ప్రవేశం కల్పించకపోతే ఆమరణ నిరాహారదీక్ష పూనుతానని బెదిరించిన గాంధీజీ ఆ మాట ఎన్నడూ నిలబెట్టుకోలేదు. అగ్రవర్గాలవారు అంటరానివారి దేవాలయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తుంటే, కాంగ్రెసుపార్టీ ఓట్లకోసం అగ్రకులాల వారిని సమర్ధిస్తుంటే, గాంధీ, కాంగ్రెసును ఖండించలేదు.

చీటికిమాటికి సత్యాగ్రహాలు, ఆమరణ నిరాహారదీక్షలు చేసిన గాంధీజీ, ఒక్కసారైనా అంటరానితనం నిర్మూలనకు నిరాహారదీక్ష పూనలేదు. ఎందుకని? హిందూ సమాజంలో అంటరానివారిని అట్టిపెట్టాలని గాంధీజీ ప్రయత్నించడమేగాక సనాతనవాదిగా కులాలు, వర్ణాలు వుండటాన్ని సమర్ధించాడు. వాటికి మూలమైన శాస్త్రాల్ని, గీతను ప్రచారం చేశాడు. కులాన్ని కాదని, వర్ణ వ్యవస్థను సమర్ధించడం కూడా గాంధీజీ ఎత్తుగడే.

కనుకనే గాంధీజీవల్ల జాగ్రత్తగా వుండమని అంబేద్కర్ పదేపదే హెచ్చరించాల్సి వచ్చింది. అంటరానితనం తొలగించనిదే స్వరాజ్యం రాదన్న గాంధీజీ ఒక్కసారైనా నిరాహారదీక్షకు పూనుకోవడం, కాంగ్రెసు చేత ఎలాంటి కార్యక్రమాన్ని చేబట్టించకపోవడం గాంధీజీ చిత్తశుద్దికి గీటురాయి. అలాగే సత్యాగ్రహం అనే ఆయుధాన్ని అంటరానివారి కోసం ఎన్నడూ ఉపయోగించని గాంధీజీ, 1929లో దేవాలయ ప్రవేశానికి అంటరానివారే సత్యాగ్రహానికి పూనుకుంటే, గాంధీజీ స్వయంగా వారిని ఖండించారు. అంబేద్కర్ ఆశ్చర్యపోయాడు. దేవాలయ ప్రవేశార్హత బిల్లును కేంద్ర శాసనసభలో రంగ అయ్యర్ ప్రవేశపెట్టడానికి గవర్నర్ జనరల్ అనుమతించకపోతే, చూసుకోమరి అని గాంధీజీ బెదిరించాడు. ఎన్నికల దృష్ట్యా యీ బిల్లుకు కాంగ్రెసు పార్టీ