పుట:AarogyaBhaskaramu.djvu/56

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
42
------ హుతాశనస్తుతి ------
చం|| అయినది భాస్కరస్తుతి. అనామయమిచ్చె నతం. డిఁక౯ భవ

ద్దయ సముపార్జితవ్య. మది తద్ద ఘటించినఁగాని నేను క్ష్మా

పయి కరుదెంచుకార్యము శుభంబుగఁ దాఁబరిపూర్తిఁ జెంద. దా

రయవలె నాస్థితి౯ వృజినరాజినిషూదన! శ్రీహుతాశనా! ౧

ఉ|| ఏటికొ తా సృజించె జగమీశ్వరుఁ డొక్కఁడయై వెలుంగకి.

ట్లేటికొ బ్రహ్మ విష్ణువు మహేశ్వరుఁ డింద్రుఁడు సూర్యుఁడగ్నినా

కోటికిదాఁటువేషము లకుంఠితశక్తిమెయి౯ ధరించె. ఈ

నాటకమంత వ్యర్థమని నామదిఁదోఁచెడిగా హుళాశనా! ౨

ఉ|| వేసెను బెక్కువేషములు వేడ్కమెయి౯ మును తానె. లీలమై

వేసినవేషమిద్దియను వేత్తృతకుం బెడఁబాసె వెన్క. ఆ

యాసపదం గడంగె నిపు డక్కట! ఎందుకువచ్చు ఘోష! బల్

మోసముసంభవించె. పడె మోహసముద్రమున౯ హుతాశనా! ౩

ఉ|| ఒక్కఁడు సూత్రధారుఁడు మఱొక్కఁడు రాజు ప్రధాని యొక్కఁడై

చక్క నటింత్రుగాక. ఇది సాంఘికనాటకమం చెఱింగి తై

తక్కయటంచుఁ దక్కొరులఁ దారె నటింపఁగఁ జేయుచుంద్రుగా.

కక్కట! వారలందఱును న ట్లెఱుఁగంగలరే హుతాశనా! ౪

ఉ|| అట్టు లెఱుంగనట్టిరులయందున నేను నొకండఁగానఁగ

న్పెట్టఁగలేక తత్త్వమును బెండ్లము బిడ్డలటన్న భ్రాంతి ను

న్నట్టిఁడనై తదర్థముగ నర్థముగూర్ప యతించు చర్థన౯

దొట్టి వినీచకృత్యములఁ దుందుడుకైతిఁగదే హుతాశనా! ౫

చం|| ఇదివఱ కెన్నిజన్మముల నెత్తితినో యటఁ గానిచేఁత యె

య్యదియెది యాచరించితినొ యాదురితంబున కర్థహినమౌ

ఉదనసితంబునం దుదయమొందితి. చెందితిఁ బెక్కుకష్టముల్.

తుదకు ఋణాలపాలయితి. త్రోవ యిఁకెయ్యదొకో హుతాసనా!

చం|| వసుధఁ గొమాళ్ళకెల్ల ఋణవత్పిత శత్రువటందు. రందులో

నిసుఁగులు మత్కుమారకులు. నేను ఋణంబును దీర్పకుండనే

అసువుల వీడిన౯ ఋణదు లాకసిగందుల నాదునింటిలో

మసలఁగనీయ. రాసిదపమాట వచింఓఁగదే హుతాశనా! ౭