పుట:AarogyaBhaskaramu.djvu/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
iii
జానపాడు
శ్రీముఖసంః శ్రావణ బ౧౧ (16-8-1988)

నమస్కారములు... మీశరీర మింకను బూర్ణారోగ్యము చెందనందుకు వగచుచున్నాను... మీ శరీరారోగ్యముగుఱించి యెల్లపుడు భగవంతుని బ్రార్థించుచు జవాబు కెదురుచూచుచున్నాను.

జానపాటి లక్ష్మీనారాయణ.
జానపాడు
శ్రీముఖసంః శ్రావణ బ౧౨ (18-8-88)

నమస్కారములు...మీయింటిఖర్చులువగైరాకొఱకు మీ రేమాత్రము విచారపదవద్దు. మీ రింటికిఁజేరువఱకు నెంతఖర్చైనను నామెగా రడిగినవెంటనే యిచ్చుచునుండఁగలను. ఇదివఱకుఁగూడ నాప్రకారమే యిచ్చుచుంటిని. మీశరీరవ్యాధి పూర్తిగా నెమ్మతించువఱకు నక్కడనే యుండఁగోరెద... మీస్థితినిగుఱించి మీయింటిలోఁనబడువిచారము వ్రాయశక్యముకాదు. మీశరీరారోగ్యముకలుగుటకు మీయుత్తరమునకు నెదురుచుచుచు భగవంతుని బ్రార్థించుచున్నది. ఈమధ్య మీజనా బాలస్యమైనందున మీకు, టిల్లిగ్రామీయవలెనని తహతహపడినది. ప్రసాదరావుగారు మీయందుఁజూపిన యాదరణకు మేమందఱము సంతోషించుచుంటిమి... మీయింటి యోగక్షేమముప్రతిదినము విచారించుచుంటిని.

జానపాటి పురుషోత్తము.
జానపాడు
శ్రీముఖ సం|| శ్రావణ బ౧౫ (21-8-88)

బ్ర|| ... పట్టాభిరామశాస్త్రి మామగారి సముఖమునకు ... నమస్కారములు ... డాక్టరుగారు మీకు స్వజనులే కనుక మీ రేమాత్ర మధైర్యపడవలసిన పనిలేదు. ఇప్పట్టున మీరు వ్రాసినప్రకారము 'మిత్రమాపత్సు జానీయా'త్తమ వాక్యము డాక్టరుగారియందే కనుపించుచున్నది. మీయింటి కేగి యక్కడనే కూర్చుండి యీయుత్తరము వ్రాయుచున్నాను ... మీరు నాకు వ్రాసినలేఖలోని సంగతులన్నియు ల|| కమలమ్మకు వినిపించినాను ... కంటివెంట నీరువిడిచినది... పిల్లలుఁ దాను మీముఖప్రదర్శనముకొఱకు సదా నిరీక్షించుచున్నామని నొక్కివ్రాయుమన్నది ... పురుషోత్తము ... మీకష్టములకు మిక్కిలి విచారపడినాఁడు ... మీరు వ్రాసినపద్యములు సులభశైలిని బాగుగానే యున్నవి ... ఆనందించితిని ... మీయింటిసంగతులు తప్పక యప్పుడప్పుడు కనుగొనుచుండెదను. మీ రధైర్యపడవద్దు. పిల్లలుఁ దల్లి క్షేమముగానున్నారు ... మీభార్య ... మీవిషయమై చింతిల్లుచున్నను వ్యక్తిగలదిగనుకఁ బైకిఁ గనఁబఱుపకుండ ధైర్యముతోనే యున్నది. మీరును బెంగపెట్టకొనవద్దు ...

జానపాటి విశ్వనాధము.

...శ్రీరస్తు. ఆరోగ్యమస్తు. దీర్ఘాయుష్యమస్తు... మీకు సంపూర్ణారోగ్యమింకను లభించనందుకు విచారముగానున్నది... ఆరోగ్యము తప్పక కలుగును.

బెజవాడ
గ్రహింపవలెను.

శ్రీముఖ సం|| భాద్రపద శు ౪ (25-8-88) మల్లాది రామకృష్ణ నిద్వచ్చయన