... బహుప్రణామపూర్వము విధేయుఁడు చతుర్వేది అమరేశ్వరుఁడొనర్చు విన్నపములు. ప్రకృతము... ఏతన్ముద్రాశాలయందు మేనేజరుగా నొకింత కఠినసరణి వ్రాయవలసివచ్చుటచే నన్ను మన్నింతురుగాక... ఎట్టివిపత్ప్రివాహములు నిరోధించినను దాటఁజాలి యిరువదియాఱు సంవత్సరములనుండి యాంధ్రదేశమందెల్లెడల వ్యాప్తమై మీ యభినవసరస్వతి యిట్టి మతవిప్లవసమయమున నిలిచిపోవుట సనాతనధర్మావలంబుల దౌర్భాగ్యమనకతప్పదు ... మొదట మీయారోగ్యస్థితి దెలుపుచుఁ బత్రికా నిర్వహణవిషయమై వ్రాయుఁడు. కాలపరిస్థిరినిబట్టి ముద్రాశాలల నిర్వహించు టెంతయు నాయాసకరముగానున్నదికాన మీరీయవలసిన పైకమును జరూరుగాఁ బంపఁ బ్రార్ధితులు ... ఇంతకంటె హెచ్చుగా వ్రాసిదీర్ఘజ్వర్జరితమైన మీహృదయమును నొప్పింపఁజాల.
మీదేహారోగ్యము చక్కగాలేదని తెలిసి మాకందఱికిఁ జాలకష్టమాయెను. మీ మిత్రవైద్యసహాయముచేఁ ద్వరలో నారోగ్యము కలుగునని భగవఁతుని బ్రార్ధించుచున్నాను.
... అంతటంతటఁ బ్రసాదరావుగారియొక్కయు మీయొక్కయు క్షేమము వ్యాయఁబ్రార్థంతును. మీ కిప్పట్టున శ్రీవారి వైద్యమే సర్వధా శేయస్కరము. కొంచెము వ్యవస్థ పట్టినను బునరారోగ్యమున కింతకన్న శరణములేదు. ఆరోగ్యమును గల్గితీరును. మీ యుపాస్యమానదైనము మిమ్ముఁ ద్రోసిపుచ్చఁడు. నేనును యథా శక్తి నాయిష్టదైవమును మీనిమిత్తమై ధ్యానించుచుందును.
శా|| మిత్రేందువ్రభృతిగ్రహంఱులకు నీమేర ౯ నివేదించి స
న్మైత్రీవల్లభునిం బ్రసాదభిషజు ౯ మన్నించి యానాఁడు సౌ
మిత్రి ౯ శీఘ్రమ యుద్ధరించినటు లీ మేదిన్యమర్త్యాగ్రణి౯
మిత్రు౯ బాంధవు బాలసంతతికు సామిరీ! కృపం బ్రోపుమా.
... వందనసస్రంబులిచ్చి శిష్యపరమాణువు లిఖించుచున్నది ... ఇంకను మీదే హారోగ్యము పూర్తిగ లేదని యారోగ్యభాస్కరపద్యములే సాక్ష్యమిచ్చుచున్నవి. పద్యములు పృద్యములుగనున్నను దద్భావమూచూడ గుండె నీఱైనది... ఆరోగ్య భాస్కరపద్యములు మఱికొన్ని పంపుదురని ప్రార్థన... రామసుబ్బారాయుఁడు.