Jump to content

పుట:AarogyaBhaskaramu.djvu/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
32
ఉ|| అరయ దేవవైద్యులు త్వదామజులేకద యాశ్వినేయు. ల

వ్వారలు నాదుపాదరుజఁ బాపఁగలారలు కానఁ బంపు మ

వ్వారల నీవు. ము౯ జ్యవను వార్ధకమూడిచి కన్నులిచ్చియు౯

మారశరీరు బుష్పసుకుమారు నొనర్పరె వారు భాస్కరా! ౨౧౭

ఉ|| కం టిటువంటి యజ్ఞభు గఖర్వభిషక్కుల రోగధక్కుల౯.

కంటివి శిష్టదుష్టులను గాచఁగ నేఁచఁగ దక్షుఁడౌ యము౯.

కంటివి దుస్థ్ససుస్థుఁడయి కాల్చను దేల్చను శక్తుఁడౌ శని౯.

కంటి జగత్పవిత్రధుని. కంటి ననుం గడగంట భాస్కరా! ౨౧౮

ఉ|| అంత జగన్నియంతలు కృతాంతపురోగము లాత్మజుల్. రమా

కాంతకు సంతతంబు నిలుగట్టెడి పద్మిని యింతి. ఇంత శ్రీ

మంతము నీకుటుంబ మణుమాత్రము భక్తజనాళిపైఁ గృపా

వంతముగాకపోవుటకె వంతపడ౯ వలెఁగాదె భాస్కరా! ౨౧౯

ఉ|| కర్ణుఁడును౯ భవత్సుతుఁడెకా! సుతు నీగి పిత౯ భజింప ను

త్తీర్ణుఁడనౌచునుంటిని నదీనిభ పద్రుజనుండి. మానుషా

కీర్ణముగాని త్యాగమన ఖేచరులెల్లను దద్వితీర్ణము౯

పూర్ణముగా భుజించుటకెపో. ఇఁక దేనికిఁగారు భాస్కరా! ౨౨౦

చం|| అకట! దధీచి వేలుపుల కస్థు లొసంగఁడె? చర్మసన్నిభ

స్వకవచకుండలంబులను శక్రున కీయఁడె కర్ణుఁ? డింక జం

కక శిబి కోసియీఁడె మెయికండలు బోయకు? ఎంచిచూడ నిం

చుకది యనామయం. బొసఁ గఁ జూడవు దానినె నీవు భాస్కరా!

ఉ|| ఆత్మజు నర్జును౯ మనుప క్ష్మామరవేషము దాల్చి వజ్రి నీ

ఆత్మజుఁడైన కర్ణునకు నాయువుపట్తగు వర్మముం గఠో

రాత్మకుఁడై హరించె. బలి నట్టులె చక్రియు మోసగించె. శు

ద్ధాత్ములు దేవతల్. మఱి తదర్థ మదేమొ యెఱుంగ భాస్కరా!

చం|| తనపగవానిఁ జంపుటకుఁ దగ్గ సుసాధన మబ్బునంచునే

అనుకొనెఁగాని యింద్రుఁడు మహర్షి బలాత్కృతిఁ జచ్చిపోకకు౯

మనమునఁ గుందఁడయ్యె నణుమాత్ర. మెవం డెటులైన స్వీయపు౯

బను లగుటే ప్రధానము సుపర్వుల. కేమననౌను భాస్కరా! ౨౨౩