పుట:AarogyaBhaskaramu.djvu/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

ఆరోగ్యార్థ మొకరించిన భాస్కరస్తుతియగుట నిది యారోగ్యభాస్కరమని యనంబడియెడి, ౨౭౭ పద్యములతోఁగూడిన యొక యల్పగ్రంథముగాని యెక్కువనికాదు. ఈ పద్యములైనను సర్వసంస్తవయోగ్యములైనవి స్వల్పము ఒక్క సావ్యక్తకే సంబంధించినవి చాల. ఇట్టి చిట్టిపాత్తమునకుఁ బీఠికగూడ వ్రాయుట యనవసరము. పైపెచ్చు హాస్యాస్పదము. గ్రంథరచనాకారణము మొదలైనవన్నియునంత వివరింపఁబడియున్నవి. నా యనారోగ్యమును బ్రకృతము చాలవఱకుఁ గలిగిన పునరారోగ్యము భాస్కరప్రసాదమూలమగుటయునే దీనిరచనకు ముఖ్యకారణము. అట్టి ప్రసాదరావుగారియెడలఁ జూపవలసిన కృతజ్ఞత యంతయు గ్రంథమందే రూపయుండియుఁదనివిచాలక మఱికొంత మిత్రలేఖల ద్వారమునఁగూడ జూపఁదలఁచియు నాయనారోగ్యమునకుఁ బరితపించియుఁదకు సాయమొవర్చియు నున్నమిత్రులయెడలఁ గూడఁ గృతజ్ఞుఁడనగుటకును దన్మిత్రలేఖలుమాత్ర మిందుఁ గొన్ని ప్రకటించుచున్నవాఁడను. ఇదియే దినికి నాపీఠిక. అందు ముందు కథానాయకునిలేఖయే ప్రకటీక్రియమాణము.

--------- మిత్రలేఖలు --------
అమలాపురము, తూ||గో|| అంగిరస్సం||జ్యేష్ఠ బ ౧౦ 28-6-1982

మీ రనారోగ్యముగా నుండుచున్నట్లును వ్యాధి మిమ్ములను జాలరోజులనుండి పీడించుచున్నట్లును నింతవఱకు... కుదురనట్లును నభినవసరస్వతి తెలుపుచున్నది. ఆషాఢ శు మొదలుకొని గోదావరీపుష్కర ప్రారంభమగును. పుష్కరముపేరు చెప్పియైనను నొకసారి యిటకు సకుటుంబముగా వచ్చి యొక పక్షమైన నాయొద్దనుండి మీరోగమున కనుకూలమగు మందు సేవించఁగలందులకుఁ గోరుచున్నాను. ఇటులొనర్చినఁ దీర్థము స్వార్థముఁ గలసివచ్చును. మీవంటివారి కాతిథ్యమిచ్చుట కన్నోదకములకుఁ గొదవలేదు. మీరు మిత్రులు బంధువులు గురువులు నగుటచే మాయింట నింతప్రసాదము పడయుటకు నేను గోరకుండనే మీకు హక్కుకలదుకావున వెంటనే బయలుదేరి వచ్చి నాకోరికను దీర్చి మీరు నిరామయులగుదురుగాకయని కోరుచున్నాను... రాక కెదురుచూచుచుందును... రాజమండ్రినుండి స్టీమరుమీఁద బొబ్బర్లంక వచ్చి యటఁ గాఱెక్కిన మా గుమ్మములో నిలుచును... ప్రసాదరావు.

త్రిలింగ కార్యాలయము... మద్రాస్
అయ్యా!
శ్రీముఖ సం|| ఆషాఢ శు౬ (29-6-88)

నమస్కారములు... ఈమధ్య జబ్బుచేసినందునఁ బత్రిక నిలిచినందుకు విచారపడుచున్నాను. త్వరలో నారోగ్యములకిగి యింకను గొంతకాలము సారస్వతసేవ చేయుదురని యెంచుచున్నాను...

నావిళ్ళ వెంకటేశ్వరులు.