పుట:AarogyaBhaskaramu.djvu/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
2

 చం||అదితికిఁ గశ్యపర్షికిని నాత్మజుఁడై జనియించి ఛాయయ౯
మదవతిఁ బెండ్లియాడి యమున౯ యము నాబిడయందుఁ గాంచియా
నది భుచి శుద్ధిఁజేయఁగను నందను బాపుల శిక్షఁజేయఁగ౯
సదయతఁ బంపియున్న నిను సంస్తుతిసేయఁ దరంబె భాస్కరా! ౭

చం|| జనులఁ బునీతులం జలుపఁజాలు సరిత్తున కన్న లొకపా
వను నినుఁ ఝుచుకొంచు ననివార్యతమై నపవిత్రపుం బనుల్
పొనరుచుచుండఁ గావలసె. పుర్వికు లిందుక యట్టిచోఁ ద్వదా
ద్యనఘపవిత్రదర్శన మనాచరణీయ మటండ్రు భాస్కరా! ౮

ఉ|| యత్నములేక కట్టెదుట నగ్నిభవజ్జలముఖ్య పావన
ప్రత్నపదార్థము ల్పడు. అపావన మూత్రవిసర్జనాదుల౯
యత్నపురస్సరంబుగన యాదెసఁ గన్గొనకుండ నుండనౌ.
నూత్ను లెటుండిన౯ బుధజను ల్పొనరించెద రట్ల భాస్కరా!

ఉ|| ఎవ్వ రెటు ల్పొనర్చినను నెరికిఁగావలె నాప్రసక్తి? నా
నెవ్వగ నాకుఁజాలు నిను నేను బ్రమత్తత నప్పుడప్ణు దౌ
దవ్వులఁ జూతు నప్పనుల. తాదృగఘక్రియ లింకఁజేతు. నీ
వవ్వి మది౯ స్మరింపక క్షమింపవలెం గృపతోడ భాస్కరా! ౧౦

ఉ|| తాదృ గమేధ్యపుం గ్రియలఁ ద్వన్ముఖ మేధ్యులఁ జాదకుండనే
ఏదొవిధం బొనర్చినను నింక సమేధ్యతమేంద్రియాళికి౯
త్వాదృ గయాభిముఖ్య మది తప్పనెతప్ప. దవార్యమౌటఁ ద
త్తాదృశకార్య మెన్నడును దప్పనఁబోలదుకాదె భాస్కరా! ౧౧

చం|| ఎవరెదియాచరించినను నీవు కనుంగొనకుండ నుండమి౯
భువిని జనించుటాదిగను బుద్ధిహీనత నేను జేసియు
న్న వృజినము ల్తలంచుకొనిన౯ భయమయ్యెడి. నీకు నాస్థితి౯
వివరముగా నిఁ కెవ్విధము విన్నపముం బొనరింతు భాస్కరా!

చం|| శతమొ సహస్రమో మఱి యసంఖ్యము లేనొ యొనర్చియుందు దు
స్కృతములు నేను. బుద్ధి యటు లీడ్చుటఁజేసి కృతంబు లవ్వి. లే
ద్గతమును గూర్చి చింతిలినఁ గార్యము లేదు. త్వదంఘ్రియుగ్మమే
గతి యిఁక. అస్మదుద్ధరణకార్యభరంబది నీద భాస్కరా!

౧౩