పుట:AarogyaBhaskaramu.djvu/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శ్రీ సూర్యనారాయణపరబ్రహ్మణేనమః.

ఆరోగ్య భాస్కరము

ఉ|| శ్రీపతి నీదు మండలము చేరి వసింపఁ ద్రయీతనుండవై

రేపులుమాపులు౯ ద్విజులు ప్రీతి నొసంగు జలాంజలుల్ కరం

బొపికతోడఁ గొంచు మఱి యూరకయుండక వారి బాధల౯

పాపుచునుండు నీదు పదపద్మముల౯ శిరముంతు భాస్కరా! ౧

ఉ|| ఈక్షితి విష్ణువంచు మఱి యీశ్వరుఁడంచు నిఁకేమొయంచు సం

రక్షణగోరి పెక్కురును రాళులు రప్పలు గొల్చుచుంద్రు. ప్ర

త్యక్షముగా విభాసిలెడి దైవము వన్నను నీవకాక యీ

రూక్షశిలాదు లెట్లగు? గురుత్వ మిఁకెందుల కందు భాస్కరా! ౨

ఉ|| లక్షలయోజనంబుల జ్వలత్ప్రళయానలుఁబోలి వెల్గు చే

కాక్షరథంబుమీఁద నినలాశువునం జను నుష్ణరశ్మి ని ౯

చక్షువులెత్తి చూచుటక శక్యముకాదనికాని యెన్నఁ బ్ర

త్యక్షపుదైవమ౯ విషయమందున సంశయమున్నె భాస్కరా! ౩

ఉ|| ఈక్షణఁ జేయఁ ద్వన్మహిమ మింకను నెంతయు యుండియుండె. ప్ర

త్యక్షత యొండెకాదు. నియతంబుగ నీ యుదయంబ కానిచో

అక్షయకాలరాత్రమగు నంతయు ధ్వాంతము పర్వెడి౯. జగ

చ్చక్షు వహస్కరుండవు త్విషాంపతి వారయు నీవు భాస్కరా! ౪

ఉ|| ఏలబహూక్తు. లాత్శ యొకఁ డేయయియుండిన లోకమంతకు౯

చాలినమేలుచేయుటకుఁ జాలనటంచని ద్వాదశాత్మవై

క్రాలుచునుంటి. వందునన కాదె సురో త్తమ లోకబాంధవా

ఖ్యాలలితుండవై యశముగాంచితి. పెంచితి వింక భాస్కరా! ౫

చం|| జగమునకంతకు౯ జగము సర్వమునుం గనుపింపఁజేయఁగ౯

తగినప్రదీపమై సతముఁ దజ్జగతీప్రజ సల్పుకర్జముల్

గగనచరుండవై సరిగఁ గమ్గెనుచుండుటఁ గర్మసాక్షియం

చొగి నుతియింపఁగాఁ బడుచునుండవె యింకను నీవు భాస్కరా! ౬