పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎత్తుకొని మిష్టర్ ఫిలిప్ అనే చిన్న చెప్పుల దుకాణదారుకు చెప్పులు కుట్టియిస్తుండేది. ఫొలిప్ దుకాణంలో ఇద్దరు లేదా ముగ్గురు, ఇంటిదగ్గర పనిచేసి మార్గరెట్ కార్నెగీ వంటి కొందరు సహాయకులతో దొరకిన ఆర్డర్లకు అనుగుణంగా చెప్పులు కుట్టించి ఇవ్వటమే కాక ఇతరరకాల పాదరక్షలను కూడా తయారుచేయించి వాటిని మోసుకొనిపోయి అలిఘనీ, పిల్స్‌బర్గులకు చుట్టుప్రక్కల వున్న గ్రామ సీమల్లోకి కూడా వెళ్ళి అమ్ముతుండేవాడు.

ఇంటిపని తక్కువగా వున్నప్పడల్లాను, కొన్ని సమయాలల్లో అర్థరాత్రివరకూ చెప్పులు కుట్టుటంలో యెంతో శ్రమపడి మిసెస్ కార్నెగీ వారానికి దరిదాపుగా నాలుగుడాలర్ల సంపాదించగలిగేది. యిప్పుడు చిన, టాయ్‌కుకూడా సాయపడవలసిన వంతు వచ్చింది. బడి లేనప్పుడు అతడు తల్లికి ప్రక్కన క్రిందుగా చిన్న పీటమీద కూచుని సూదులకు దారాలెక్కించి ఇవ్వటం, దారాలపై మైనం వ్రాసి అందివ్వటం చేస్తుండేవాడు. ఆ సమయంలో ఆమె అతనికి అద్భుతమయిన తన జ్ఞాపకశక్తితో స్కాచ్ వైతాళికులు పాడిన కొన్ని వీరగీతాలనో, వాల్టర్ స్కాట్ రచించిన దీర్ఘ కావ్యాలల్లోనుంచి కొన్ని భాగాలన్ కంఠస్థం చేసిన వాటిని వినిపిస్తుండేది. ఎంతో చక్కగా ఉల్లాసం కల్పించగల దన్న ఆమె కీర్తి పరిసరాలల్లో వున్న పిల్లలో బాగా వ్యాపించి పోయింది. ఆమె స్కాచ్ చరిత్రలోనుంచి కథలను చెపుతుంటేనో,