పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎకనమిక్స్ అండ్ హిస్టరీ, శాంతి-సమరం అన్న రెండు విషయాలమీద తమ ప్రభావాన్ని నెరపుతున్న రాజకీయ, సాంఘిక, ఆర్థిక కారణాల స్థితిగతులను గురించిన పరిశోధనలను చేస్తుంది. ఆ యా రంగాలలో శాంతిదృష్ట్యా అనుసరించవలసిన మార్గాలను, కార్యక్రమాలను సూచిస్తుంది. అంతర్జాతీయ న్యాయశాఖ "ది డివిజన్ ఆఫ్ ఇంటర్ నేషనల్" లా, వివిధ దేశాల న్యాయశాస్త్రాలను పరిశీలించి అంతర్జాతీయ న్యాయసూత్రాలను నిర్మించి వివిధ జాతులమధ్య ఏర్పడే తగాదాల విషయంలో వాటిని అమలుపరచేటందుకు యత్నిస్తుంది. ఈ అంతర్జాతీయ న్యాయశాస్త్ర మనేది కొన్ని నిబంధనలు ఒడంబడికలు అన్న వాటి సముదాయం తప్ప మరేమీ కాదు.

అంతర్జాతీయ శాంతికోసం తన మిత్రుడు నిలిపిన నిధి విషయంలో అడ్డు లేని ఆశావాదికి కూడా విశ్వాసం కలగటానికి కొంత కాలం పడుతుందనీ, కార్నెగీ చర్చా ప్రచారములొక్కటే అంతర్జాతీయ యుద్ధాలను నిషేధించటాన్ని సాథించలేవనీ క్రొత్తమార్గాన్ని స్వీకరించిన కార్నెగీ దు:ఖాత్మకమయిన ప్రత్యక్ష గుణపాఠాన్ని నేర్చుకోటం విథి నియమితమని లార్డు మోర్లే భావించాడు.

మోర్లే వెల్లడించిన భావాన్ని గురించీ కార్నెగి ఇలా వ్యాఖ్యానించాడు. "వ్యతిరేకాభిప్రాయాలు గల వాళ్లు పరస్పరం స్నేహం చేస్తే అది అన్యోన్య ప్రయోజన కారిగా వుంటుందని మేము ఒకరి కొకరము సాన్నిహిత్యాన్ని పెంచు