పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బయటివాళ్ళ దగ్గర్నుంచి అతడు సంపాదించిన మొదటిపెన్నీ యిదే స్కాట్ పుర్గ్రంధాలలోనుంచి ఒకచిన్న కావ్యాన్నో లేక వచన భాగాన్నో కంఠస్థంచేయించి అంకుల్ లాడర్ అప్పుడప్పుడూ ఒకటో రెండో పెన్నీలు అతడికి ఇస్తుండేవాడు. కావ్యాలను కంఠస్థం చెయ్యడం ఆనాటి ఆచారం. కోరినపుడు వుపయోగించటానికి వీలుగా నాలుకతుదను వుత్తమకవిత్వసంపదను నిల్పుకొని జీవితాలను సంపన్నం చేసుకున్న ఆనాటి అనేకులలో ఆండ్రూ ఒకడుమాత్రమే.

నెలవాదిగా అయి, - నిశ్చయంగా తాము అమెరికా చేరటానికి యత్నించాలెనని మార్గరేట్ కార్నెగీ ఒప్పుదల చేసుకున్నది ధామస్ హోగన్లు, ఆండ్రూ ఐట్కన్లు - పిట్స్ బర్గుకు పైగా వున్న అలిఫనీ నదిమీద పిట్స్ బర్గుకు సోదర నగర (మైన అలిఘనిలొ-) ఇప్పు డిది పిట్స్‌బర్గులో ఒక భాగం ... నివసిస్తున్నారు. పెద్ద ధనికులు కాలేకపోయినప్పటికీ స్కాట్లండ్‌లో కంటే సుఖంగా అక్కడ వారి జీవితం గడచి పోతున్నది. పిట్స్ బర్గుకు పశ్చిమంగా ఎంతో దూరం కాని ఓహైయోలో ఆమె సోదరుడు మారిసన్ తన వ్యవసాయ క్షేతంలో కృషిచేస్తూ కొంత అభివృద్ధికి వస్తున్నాడు. వ్యవసాయ క్షేత్రంలో తన భర్త ఎందుకూ పనికిరాడని మిసెస్ కార్నెగీకి తెలుసు. అయితే పిట్స్‌బర్గులోగాని, అలిఘనీలో గాని తన భర్త ప్రవృత్తికి తగ్గపని ఏదైనా దొరికితీరుతుందని ఆమె ఊహించింది. అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలి అని విలియంకు ఆమె నెమ్మది నెమ్మదిగా వెంటబడి బోధించింది.