పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయితే మిగిలిన మగ్గాన్ని, గృహోపకరణాలను వేలములో అమ్మితే వచ్చిన మొత్తం శోచనీయమైనంతస్వల్పం, కార్నెగీల సముద్ర ప్రయాణానికి అవసరమైన మొత్తానికి ఇంకా ఎంతో తక్కువైంది. ఈనాడు మనం నమ్మలేనంత తక్కువ మొత్తంలో ఎవరైనా సరే తెరచాప పడవ లెక్కి ఆనాడే అట్లాంటిక్ సముద్రాన్ని దాటటానికి వీలున్నప్పుడు కూడా వారిని బయట పడవేయాలని మార్గరెట్‌కు జీవిత పర్యంత మిత్రురాలు ఒకతె పూనుకొని నంతవరకూ వారిస్థితి నిరాశాపూరితమై ఉంది. ఆ మిత్రురాలు మిసెస్ జాన్ హేన్డర్ సన్ - మార్గరెట్‌కు "అయ్‌లీఫార్గీ" కన్నెగా వున్నప్పుడు ఆమె పేరు ఆలిసన్ ఫెర్గుస న్ - ఈ పేరునె మార్గరెట్ చిన్నతనంలో "ఆలైఫార్గీ" అని ఉచ్ఛరించేది అయ్‌లీఆమె భర్త ఇల్లు కొనుక్కుందామని ప్రతి నెలా పదిషిల్లుంగులు, అంటే రెండున్నర డాలర్లు, తీసి విడిగా జాగ్రత్తపెడుతున్నారు. మిసెస్ హెన్డర్ సన్, ఎవరి మాటా వినకుండా చివరకు కార్నెరీలకు వినాశం తప్ప ఏమీ కలగబోదని ఊహిస్తున్న మార్గరెట్ సహోదరుడయిన థామస్ మాటనుకూడా తిరస్కరించి, తాము దాచుకున్న మొత్తం ఇరవై పౌనులూ మార్గరెట్‌కు ఇవ్వటానికి సంసిద్ధురాలైంది.

"ఓహో! అయ్‌లీ" అని తబ్బిబ్బుపడి ఆశ్చర్యాన్ని వెలిబుచ్చింది. "మరి మీ ఇల్లో!"

"అది ఆగవచ్చు. నా బాల్య మిత్రురాలికి నేను చేసే ఈ సాయం చాలా స్వల్పం" అన్నది మిసెస్ హెన్డర్ సన్.