పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రిరువురూ ఆమెను శీతలమైనవిమర్శక దృష్టితో చూశారు.

"ఆమె మీ అమ్మవలె పొడగరికా"దన్నాడు డాడ్.

"ఆమె గౌను ఏమంత అందంగా కూడాలే"దన్నాడు నైగ్. వాళ్ళ వెంట వచ్చిన తన అమ్మనుచూస్తూ.

వయసు వచ్చిన తరువాత ఇంగ్లండుయెడ అతని దృష్టి పక్వమైంది. అతడు ఉన్నతులు, బిరుదాంకితులు అయిన అనేకమంది ఆంగ్లేయులతోను, వారి కుటుంబాలతోను సన్నిహితమైత్రిని పెంపొందించుకున్నాడు. కాని అతడు బాల్యంలో సామరస్యంలేని స్కాచ్ పక్షపాతి.

డన్ఫ్‌ర్మ్‌లైన్ లోని కార్మికులు, వ్యాపారస్థులు బాగా చదువుతుండెవారు. ఆలోచనలు చేస్తుండేవారు. వర్తమాన విషయాలమీద అక్కడ మితవాదులు మొదలు అతివాదుల వరకూ అన్ని భావఛాయలున్నవారు ఉండటంచేత - చర్చలు చేస్తుండేవారు. ఈ చర్చలు ముఖ్యంగా రాజకీయమత విషయాలను గురించి సాగుతుండేవి. వాళ్ల చిన్ని పుస్తకాల షెర్ఫ్‌లలో ఉన్న పుస్తకాలను ఒకచోటికి చేర్చి చదువుదామని తృష్ణ ఉన్న ఎవరికైనా పుస్తకాలను ఎరువు ఇచ్చే అయిదుగురిలో విలియం కార్నెగీ ఒకడు. యీ కారణంవల్లనే కార్నెగీకి గ్రంథాలయాలను నెలకొల్పాలన్న ఆత్మోర్బోధ సహజంగా కలిగింది. అతడికి రాబర్టు బరన్స్ కావ్యాలమీద కేవలం స్కాచ్ వారికి మాత్రమే వుండదగ్గా, అందులో అతనికి మరీ విశిష్టమై అతనిదే అనదగ్గ శ్రద్ధాయుతమైన గౌరవం వుండేది. కార్నెగీలో ఇది జీవిత పర్యంతం ఇలాగే ఎట్టిమార్పును పొందకుండా నిలచి