పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/18

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


లోబ్ లెవన్‌ను తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళకు సరస్సులోవున్న చిన్న ద్వీపంమీద నేడు శిథిలావస్థలో వున్న, దుర్గంలోనే ఎలిజిబెత్ రాణి ఏడవ హెన్రీ రాజుకు పెద్ద మనుమరాలిని గనుక వారసత్వం వల్ల రాజ్యం నాదని కోరిన దురదృష్ట వంతురాలు మేరీని ఖైదీ చేసిందన్న సంగతి వాళ్ళకు తెలుసు.

తరువాత చాలా సంవత్సరాలకు ఆండ్రూ, ఇక్కడా అక్కడా జనోపయోగ కృత్యాలను చేస్తున్నప్పుడు, లాడర్ టెక్నికల్ కాలేజీని కట్టించి తనకు ప్రియుడైన తన అంకుల్‌కు స్మృతిచిహ్నంగా దాన్ని దానం చేశాడు. జార్జి లాడర్ జూనియర్ ఆండ్రూలు జీవిత పర్యంతం పరస్పరమైన స్నేహానుబంధంతో వర్తించారు. అతి బాల్యదశలో వాళ్లు ఒకరిపేరు ఇంకొకరు పలకలేకపోయేవారు. ఎంతో బాగా అనగలిగితే ఆండీ జార్జిని 'డాడ్‌' అనీ, జార్జి కర్నెగీని కుదించి 'నైగ్‌' అనీ అనగలిగేవారు. తరువాతి జీవితంలో కూడా వాళ్లు ఒకరి నొకరు అలాగే పిలుచుకొన్నారు. ఆలాగే ఉత్తరాలల్లో సంతకాలు చేశారు.

వారి వయస్సు ఆరేళ్లు వున్నప్పుడు స్కాట్లండులోని ఉత్తర భాగంలో పర్యటించటానికివచ్చిన యువ విక్టోరియా రాణిని చూడటం కోసం వాళ్ళను తీసుకువెళ్ళటం జరిగింది. ఆమె ఆంగ్ల దేశీయురాలు. దాక్షిణాత్య. ఈ బాలురు దేశభక్తి పూరితులు. తమ దేశానికి దేశీయుడైన ఒక రాజు వుండాలని వీళ్ళ అభిప్రాయం. అందువల్ల ఈ స్కాబ్ బాలు