పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[ సన్మాన పత్రాలు ] ఇచ్చి అవసరమయిన తంతును అతిఘనంగా జరిపించారు. ఇతరు లందరికంటె ఇతడు ఈ జాతి గౌరవాలను విశేషంగా పొందాడు. అవి ఏబదితొమ్మిది. ఈ గౌరవాలను పొందిన వారిలో ఇతని తరువాతివాడు మిష్టర్ గ్లాడ్‌స్టన్. ఇతని కబ్బిన ఇట్టి గౌరవాలు పది హేడు మాత్రమే. ఈ అమెరికన్ ఘన వ్యాపారిని పార్ల మెంటుకు ఎన్నుకోవాలన్న వదంతి కూడా ఇంగ్లండులో బయలు దేరింది.

మిస్ లిట్ఫీడ్డ్ ఇదంతా చూసి భయపడిపోయింది. ముఖ్యంగా ఆమె భీతికి కారణం ఇతడు బ్రిటిష్ పార్లమెంటులో కూర్చోబోతున్నాడని వినటం. చివరకు ఇంత విశేషంగా విస్తృతిని పొందిన అతని జీవితానికి తాను ఉపకరించ లేదనే నమ్మకంతో ఆమె ఒడంబడికను (Engagement) భగ్నంచేసింది.

1886 లో క్రెస్సన్ పర్వత శిఖరంమీద ఉన్నప్పుడు కార్నెగీకి టైఫాయిడ్ జ్వరం పట్టుకున్నది. ఆ సమయంలో దు:ఖం అతణ్ని విశేషంగా క్రుంగ దీసింది. ఆతని తల్లి, సోదరుడు ఇరువురూ జబ్బుచేసి మరణించారు. మిసెస్ కార్నెగీ మరణానికి విశేషంగా వృద్ధాప్యం కారణం. కానీ నలభై మూడేళ్ళ వయసులోనే టామ్ చనిపోవటం ఆండ్రూకు అనుకోని ఉపద్రవం. ఈ వార్తను అతనికి తెలియజేసినప్పుడు అతడు ఇక తాను జీవిస్తేనేం మరణిస్తేనేమన్నంత నిస్పృహచెందాడు. అఖిల ప్రపంచంలో అతని కత్యంత ప్రియతములయిన ఇద్దరినీ అతడు కోల్పోయినాడు. ఆ ఇరువురూ అతనికి విలువయిన సలహాదారులు, సహాయకులు, టామ్‌కార్నెగీ