పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

న్నాడు. మాధ్యూ ఆర్నాల్డు, తాత్నికుడు హెర్బర్టుస్పెన్సర్, వై కౌంట్ మోర్లే, ఎరల్ ఆప్ ఎల్జిన్, సర్ విలియంవెర్నాస్, హార్ కోర్ట్, నార్డు బ్రైస్, గ్టాడ్ స్టన్, రోజ్ బరీ, బాల్పోర్, కాంబల్ బానర్ మన్ ప్రభృతులయిన ప్రధానమంత్రులు, తప్పనిసరిగా ప్రముఖులయిన పారివ్రామికులు, బ్యాంకర్లు అతని ఆప్తమిత్రవర్గంలోని వారయినవారు. అతడు ఒకమారు బ్రిటిష్ ఐరన్ అండ్ స్టీల్ ఇన్‌స్టిట్యూటుకు అధ్యక్షపదవిని నిర్వహించారు. అనేక విషయాలమీద తన అభిప్రాయాలను వెల్లడిస్తూ బ్రిటిష్ పత్రికల కెన్నిటికో వ్యాసాలు వ్రాశాడు. 1886 లో ప్రకటితమైన అతని "ట్రయం ఫేంట్ మార్చి" అన్న గ్రంథంలో అతడు పూర్వ ప్రపంచంకంటె అమెరికాకున్న ఆధిక్యాన్ని విశేషంగా పొగడినప్పటికీ అతనిమీద బ్రిటన్‌ లో జనానురాగం ఇంచుకైనా తరగ లేదు. అనేకమంది బ్రిటిష్ మంత్రులతో అతడు సంభాషించిన సమయాలల్లో అతడు రాచరికాన్ని రద్దుచేసి గణతంత్ర రాజ్య వ్యవస్థను నెలకొల్పుకోవలసిందని యెంతో తీవ్రంగా వాదించాడు. తన అతివాద భావాలను ప్రచారం చెయ్యటంకోసం అతడు యునై టెడ్ కింగ్డం లోని అనేక పత్రికలను కొన్నాడు. అతని దృష్టిలో బ్రిటిషువారు కేవలం మితవాదులు. అయినప్పటికీ అతడు ఆ బ్రిటిషువారి ప్రేమను విశేషంగా చూరగొన్న అమెరికన్ అని అనిపించుకొన్నాడు. ఇంగ్లీషు, స్కాచ్, ఐరిష్ జాతులవారు, ఒకరి తరువాత ఒకరు, అతనికి "ఫ్రీడం ఆఫ్ ది సిటీ" ఇచ్చి గౌరవించారు. ఈ సమయంలో వారు సుదీర్ఘాలైన 'స్క్రోల్సు'