పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవ్వినట్లు తోచింది. యూనియన్ పసిఫిక్ డైరెక్టర్లు న్యూయార్క్‌లో కలుసుకొని స్లీపింగ్ కార్ల కాంట్రాక్టు ఇవ్వనున్నారు.

"సుసాయంతనం. మిష్టర్ పుల్మన్" అన్నాడు కార్నెగీ ఉత్సాహంతో.

పుల్మన్ "సుసాయంతనం" అన్నాడు చేదుగా, కానీ కార్నెగీ కలవరపడ లేదు.

"ఇక్కడ మనం కలుసుకోటం ఎంతో చిత్రంగా వుంది" అన్న గమనిక చేశాడు కార్నెగి, కానీ అతడి దగ్గర నుంచి అందుకు సమాధానమైనా రాలేదు. క్షణకాలం కలవరపడి తెప్పరిల్లి కార్నెగీ పసివాడిలా నవ్వి "బాగుంది, మన మిద్దరం ఇక్కడే కలుసుకోటం. మన మిద్దరం మనకు మనమే బుద్ధిహీనులను చేసుకొంటున్నామన్న భావం నీకు కలగటం లేదా?" అన్నాడు.

ప్రతిద్వంది అయిన ఆ ఉత్పత్తిదారు ఆగి ఈవిధంగా తన్ను ఎదిరిస్తున్న వ్యక్తిని పరకాయించి చూచి ఐతే నీఉద్దేశ మేమిటి?" అన్నాడు.

"యూనియన్ పసిఫిక్ వ్యాపార విషయం. దాన్ని గురించి రాగల అవకాశాల నన్నింటినీ పోగొట్టుకుంటూ మన మిరువురమూ ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకోటంలో ప్రయోజనమేముంది?"