పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ మాట పుల్మన్ బుద్ధి కెక్కింది. "అయితే దీన్ని గురించి నీవేమి చేద్దామంటావు" అని అడిగాడు.

"కలిసి పోదాం" అని కార్నెగీ కొంత బిగ్గరగా అన్నాడు. "నీ బృందము, నా బృందము కలిసి ఒక కంపెనీని స్థాపించి యూనియన్ పసిఫిక్ వారికి ఒక సమిష్టి సూచన నిద్దాము."

"దాని పేరేమిటి?"

పేరు అతనికి ప్రధానమయిన ప్రశ్న ఔతుందని కార్నెగీకి తెలుసు, సమాధానం సంసిద్ధంగా వుంది. "ది పుల్మన్ పాలస్ కార్ కంపనీ" అన్నాడు.

మంచులా గడ్డకట్టి వున్న మోము వెంటనే వికసించింది. "నా గదిలోకి రా, మాట్లాడుకుందా"మని ఆహ్వానించాడు.

ఇలా ఆ వ్యాపారాన్ని సాధించటం జరిగింది. సుస్వభావం గల థియోడోర్ వూడ్రఫ్, క్రొత్త కంపెనీకి పేరు పెట్టటాన్ని గురించి కొంచెం అనిష్టం వ్యక్తంచేసినా, ఇలా కలిసిపోవటంవల్ల కలిగేటందుకు వీలున్న ఆర్థిక ప్రయోజనాలను చూపించి చెప్పుకొన్నప్పుడు, ఆ పథకాన్ని అంగీకరించాడు.

కానీ చివరకు ఉక్కు కార్నెగీని తన పాశాలల్లో కట్టి పడేసింది. కొద్ది పరిమాణాలల్లో ఉక్కును తయారుచేయటం పూర్వంనుంచీ జరుగుతూనే వుంది. రైలుపట్టాలు వంతెన