పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/132

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పూర్వకత వుందో అంతటి మన:పూర్వకతను ప్రదర్శిస్తున్నది. మనుష్య ద్వేషులు కొందరిందులో ప్రకటితమైన తత్వాన్ని మోసకారి తనమని అపహాస్యం చేశారు. కార్నెగీ దీనినంతటినీ హృదయపూర్వకంగానే ఉద్దేశించాడు, తన సంపదను అంతటిని దానం చెయ్యకపోయినా తరువాత కాలంలో చెప్పినదంతా కార్యరూపాన చేసి చూపించే సమయం వచ్చింది.

చదువుకోసం అతడు ఆక్స్‌ఫర్డ్ వెళ్ళ లేదు. ఉపన్యాసాలివ్వటంలో, చరిత్ర, తత్వశాస్త్రము, సాహిత్యము, కళలు అన్న అంశాలల్లో తనజ్ఞానాన్ని పెంపొందించుకోటానికి ఎంతో కృషిచేశాడు. వ్యాపారం తోబాటు, ఆత్మ సంస్కృతిని అభివృద్ధి చేసుకోటంకూడా ఒక ఉద్దేశంగాపెట్టుకొని అతడు ఇంగ్లండుకు తదితర దేశాలకు ఎన్నోమారులు యాత్రచేశాడు. అతడ్ని రెంతూ ఆకర్షించటం ప్రారంభించాయి. అంతరాత్మలో ఉన్నత విషయాలమీద ప్రగాఢమైన ప్రేమ వున్నప్పటికి అతడు వ్యాపారంలో కలుగుతున్న విజయవ్యామోహాన్ని ఎదుర్కో లేక పోతున్నాడు. వ్యాపారానికి స్వస్తి చెప్పటం కోసం కేటాయించుకున్న రెండు సంవత్సరాలల్లో అతడు హృదయ పూర్వకమైన తీవ్రకృషి చేశాడు. అతడు, బాల్టిమోర్ ఓహైయో రైల్‌రోడ్ పెట్టుబడిదారు, జాన్. డబ్లియు. గారెట్‌దగ్గరికి వెళ్ళి హీలింగ్ పార్కర్స్‌బర్గు అన్న రెండు ప్రదేశాలల్లో