పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/131

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


"మానవుడికి ఆదర్శం అంటూ ఒకటివుండాలి. ధననిధులను ప్రోగుచేయటంకంటే నీచమైన ప్రతిమారాధనం మరొకటి లేదు. ధనపూజకంటే నై చ్యాన్ని కల్పించే ఆరాధన మరొకటి లేదు. చేపట్టిన ప్రతి వ్యవహారంలోనూ నెను అతిఘనముగా చొచ్చుకుపోవాలి. తన వర్తనవల్ల ఉన్నతికి తీసుకుపొయ్యే జీవితాన్నే నేను ఎన్నుకోవాలి. అనతికాలంలోనే ఎక్కువ డబ్బును సంపాదించే మార్గాల నన్నింటిని అన్వేషించటంలోనే బుద్ధి నంతటినీ వినియోగిస్తూ మరింత కాలాన్ని వెచ్చించడ మనేది నిత్యంగా త్రిప్పుకోవటమంటూ లేని రీతిగా నన్ను పడవేసి తీరుతుంది. ముప్పది ఐదవ యేట వ్యాపారాన్ని పూర్తిగా విరమించేస్తాను. రానున్న రెండు సంవత్సరాలల్లో శిక్షణను పొందుతూ, క్రమపద్ధతిలో గ్రంథపఠనం చేస్తాను.

రెండు సంవత్సరాలల్లో కాదుగదా జీవితంలో ఎప్పుడైనా సరే వ్యాపారిక సమ్మోహనాలనుంచి తప్పించుకోవటం ఎంత కష్టమో అతడు ఆ సమయంలో కొంచెమైనా వూహించ లేదు. అతడు వ్యాపారానికి స్వస్తి చెప్పేందుకు ఇరవై ఏళ్లు పట్టింది. అయినా ధనసంపాదన కంటే సంస్కృతి మీదనే విశేషాభిమా నాన్ని వెలిబుచ్చే ఈ ప్రకటన నిజానికి సంపద దాన్ని ఆర్జించిన ధనాధిపతిది కాదు, ప్రజా సంక్షేమం కోసం అతని పరంగా వున్నట్రస్టు. అతడు తన ధనాన్ని గురించి అలాగే భావించాలి అన్న ధోరణితో అతడు తరువాత కాలంలో చేసిన బోధల్లో ఎంతటి మన: