పుట:Aandhrashaasanasabhyulu.pdf/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అల్లు ఎరుకనాయుడు

Aandhrashaasanasabhyulu.pdf

ప్రజా సోషలిష్టు : సాలూరు (జనరల్) నియోజకవర్గం, జననం : 1914, విద్య : యింటర్ మీడియట్, 15 సం. క్రిందట రాజకీయ రంగప్రవేశం, సాలూరు తాలూకా రైతుసంఘ కార్యదర్శి, 1941 - 50 సాలూరు పంచాయితీబోర్డు అధ్యక్షుడు, జిల్లా ఇరిగేషన్ కమిటీ సభ్యుడు, సాలూరు పురపాలకసంఘ సభ్యుడు. ప్రత్యేక అభిమానం : నీటిపారుదల స్కీములు, హరిజనాభ్యుదయము. అడ్రస్సు : నాయుడువీధి, సాలూరు, శ్రీకాకుళంజిల్లా.

బోయిన రాజయ్య

Aandhrashaasanasabhyulu.pdf

కాంగ్రెసు : సాలూరు (రిజర్వుడు) నియోజకవర్గం, జననం : 1-7-1915, విద్య : యస్. యస్. యల్. సి. 2 సం.లు తాలూకా కాంగ్రెస్ సంఘసభ్యుడు, ప్రాధమికోపాధ్యాయుల జీవన ప్రమాణాభివృద్ధికై కృషి. ప్రత్యేక అభిమానం : సాలూరు తాలూకాలోని షెడ్యూల్డు తరగతుల అభివృద్ధికి కృషి. అడ్రస్సు : జమివలస, సాలూరు తాలూకా, శ్రీకాకుళంజిల్లా.

సిమ్మా జగన్నాధం

కాంగ్రెసు : నరసన్నపేట, నియోజకవర్గం, జననం : 1922, విద్య : బి.ఎ.బి.యల్. 1950లో సోషలిస్టుగా రాజకీయ జీవితం ప్రారంభించి 1953లో లోక్ పార్టీలో ప్రవేశం, శ్రీకాకుళం జిల్లా రెడ్ క్రాస్ సంఘ సంయుక్త కార్యదర్శి, శ్రీకాకుళం హిందీ ప్రేమీమండలి కార్యదర్శి, శ్రీకాకుళం మోటారు కార్మికుల సంఘ అధ్యక్షుడు. ప్రత్యేక అభిమానం : ప్రజాసేవ, అడ్రస్సు : అడ్వకేటు, శ్రీకాకుళం.

పైడి నరసింహ అప్పారావు

Aandhrashaasanasabhyulu.pdf

స్వతంత్ర : పాలకొండ నియోజకవర్గం, జననం : 1908, విద్య : యస్. యస్. యల్. సి. 1922 నుండి కాంగ్రెసువాది, 1936 విశాఖజిల్లా రైతుసంఘ కార్యదర్శి, 1937 తాలూకా కాంగ్రెసు సంఘానికి మూడు సం.లు అధ్యక్షుడు, కార్యాచరణ సంఘసభ్యుడు, 1937-54 రాష్ట్ర కాంగ్రెసు సభ్యుడు, 1951-54 లో అఖిల భారత కాంగ్రెసు సంఘసభ్యుడు, 1950-53 జిల్లాబోర్డు సభ్యుడు, 1950 నుండి విజయనగర సెంట్రల్ స్టోర్సు ఉపాధ్యక్షుడు, 1954 డిసెంబరు వరకు జిల్లా కాంగ్రెసు కార్యాచరన సంఘసభ్యుడు, సంయుక్త కార్యదర్శి, ఎన్నికల ముందర కాంగ్రెసు నుండి వైదొలగుట. ప్రత్యేక అభిమానం : జాతీయ పరిశ్రమలు. అడ్రస్సు : పాలకొండ, శ్రీకాకుళంజిల్లా.