పుట:Aandhrashaasanasabhyulu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లుకులాపు లక్ష్మణదాసు

కాంగ్రెస్ : పాతపట్నం (జనరల్) నియోజకవర్గం, జననం : 1916, విద్య : బి. కాం., 1939లో ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థిసంఘ ప్రధాన కార్యదర్శి, 1942లో కాంగ్రెస్ ఉద్యమములో ప్రవేశం, 1948 శ్రీకాకుళం కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు డైరెక్టరు, 1949-53 సెంట్రల్ బ్యాంకు ఉపాధ్యక్షుడు, ఆంధ్రరాష్ట్ర రైతు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ సహాయ కార్యదర్శి, 1950 లో జిల్లా బోర్డు మెంబరు, రాష్ట్ర హరిజన సేవా సంఘ కార్యవర్గ సభ్యుడు, 1952 లో అవిభక్త మద్రాసు రాష్ట్ర శాసనసభలో సభ్యుడు, ప్రత్యేక అభిమానం : విద్యాభివృద్ధి, రైతు ఉద్యమము, సహకార ఉద్యమము, అడ్రసు : కొమ్ముసరియాపల్లి, శ్రీకాకుళం జిల్లా.

పోతుల గున్నయ్య

కాంగ్రెస్ : పాతపట్నం (రిజర్వుడు) నియోజకవర్గం, వయస్సు : 47, విద్య : 3వ ఫారం, తాలూకా, జిల్లా, కాంగ్రెస్ సభ్యుడు, తాలూకా హరిజన సంఘాధ్యక్షుడు, జిల్లా బోర్డు సభ్యుడు, జిల్లా హరిజన సంక్షేమ సంఘసభ్యుడు, రాష్ట్ర వ్యవసాయ కూలీ కార్యాచరణ సంఘసభ్యుడు, 1952 లో మద్రాసు శాసనసభలో సభ్యుడు, ప్రత్యేక అభిమానం : దినపత్రికలు, అడ్రస్సు : చిన్నబొండపల్లి, పార్వతీపురం పోష్టు, శ్రీకాకుళం జిల్లా.

కోటగిరి శీతారామస్వామి

కాంగ్రెస్ : బొబ్బిలి నియోజకవర్గం, జననం : 1904, విద్య : స్కూలు ఫైనలు, 1932లో రాజకీయ ప్రవేశం వెంటనే జైలుశిక్ష, 1938-42 విశాఖపట్టణం జిల్లా బోర్డు ఉపాధ్యక్షుడు, 1950-53 వరకు శ్రీకాకుళం జిల్లాబోర్డు ఉపాధ్యక్షుడు, విశాఖపట్టణంజిల్లా విద్యాసంఘసభ్యుడు, శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, విజయనగరం సెంట్రల్ బ్యాంకి ఉపాధ్యక్షుడు, ప్రత్యేక అభిమానం : సహకారోద్యమం, అడ్రస్సు : వెలమవీధి, బొబ్బిలి, శ్రీకాకుళంజిల్లా.

చౌదరి సత్యనారాయణ

కాంగ్రెస్ : షేర్‌మహమ్మద్‌పురం, నియోజకవర్గం, జననం : 10-6-1910, విద్య : 4వ ఫారం, 1940 లో వ్యక్తి సత్యాగ్రహంలో జైలుశిక్ష, 1942 ఉద్యమములో అజ్ఞాతవాసం, 1951 లో కాంగ్రెస్ నుండి రాజీనామా, తాలూకా లోక్ పార్టీ ప్రధాన