Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/735

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

708

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

చున్నారు. [1]ఈకవి బ్రాహ్మణుఁడు; భైరవాచార్యుని పుత్రుఁడు. ఈతని యాశ్వాసాంతగద్య మిట్లున్నది
     
              “ఇది సకలసుకవిజనసంస్తూయమానకవితాచాతురీధురీణ నిఖిలభాషా ప్రవీణ
               భైరవాచార్యపుత్ర పరమపవిత్ర మనుమంచిభట్ట ప్రణీతంబైన హయలక్షణ
               విలాసంబునందు"

ఈతని కవిత్వము చక్కఁగానే యున్నది. కాని యేహేతువు చేతనో లక్షణ విరుద్ధములయిన ప్రయోగము లనేకములు కానఁబడుచున్నవి. కవిత్వరీతిని దెలుపుటకయి హయలక్షణవిలాసములోని పద్యములఁ గొన్నింటి నిం దుదాహరించుచున్నాను.

     ఉ. దూరము పోవునప్పుడును దుర్గమశత్రునృపాల సైన్యముం
         బోరుల గెల్చునప్పుడును బొంకముగా మృగయావినోదవి
         ద్యారతిఁ దేలునప్పుడు నరాధిపకోటికి వాజులట్ల పెం
         పార జయాదికారణము లారసి చూడఁగఁ గల్గ నేర్చునే ? ఆ. 1

     చ. అరయఁగ సర్వలక్షణసమంచితమైన తురంగరత్న మే
         నరునిగృహాంబునం దొక దినంబుననుం దగురీతి నుండు నా
         పరమపవిత్ర గేహమునఁ బాయక నిల్చుర మా వధూటి శ్రీ
         ధరునియురస్థలింబలె ముదం బెసలారఁ బ్రసన్న చిత్తయై. ఆ.1.

     చ. తిరముగ రోచమానమును దేవమణిం దగఁ గూడి యున్నయ
         త్తురగము పూర్వభాగకృతదోషము లన్నియుఁ ద్రెంచు, నెంచఁగాఁ
         బరఁగినయట్టి మేఖలిక పశ్చిమభాగము దోషరాసులన్
         బొరిఁబొరిఁ ద్రుంచుమాడ్కి మఱి భూవరగర్వముఁ దక్క నన్నిటిన్

  1. [కర్నూలుజిల్లా పెద్దచింతకుంట శాసనమును బట్టియు, తిరుపతియందున్న కంపభూపతి శాసనమును బట్టియు మనుమంచిభట్టు కాలము క్రీ. శ. 1442-1459 ప్రాంతమని నిశ్చితమగుచున్నదని శ్రీ నిడుదవోలు వేంకటరావు గారు తెల్పుచున్నారు (చూ. భారతి - విరోధి - ఆషాఢము]