పుట:Aandhrakavula-charitramu.pdf/615

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

588

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

యాజిమనుమనిమనుమఁడైన పేరమంత్రికి శివరామాభ్యుదయనామకద్వ్యర్థి కావ్యకర్తయైన పోడూరి పెదరామకవి శాలివాహనశకము 1678 అనగా హూణశకము 1756 ధాతసంవత్సరాశ్వయుజశుద్ధ దశమీ సోమవారము నాఁటి కొక తాటాకుల ప్రతిని దాక్షాయణీవివాహమును వ్రాసియిచ్చి దాని యడుగున నీ క్రింది సీసపద్యములు వ్రాసెను.

       సీ. ధాతాశ్వయుజకృష్ణదశమీందువారంబు
                            వఱకు దాక్షాయణీపరిణయంబు
           తత్కృతినాథుఁడై తనరిన గురుజాల
                           చినమల్లసోమయాజికిఁ దనూజుఁ
           డగు లింగఘనసుతుఁడు డైనట్టి యజ్ఞస
                           త్ప్రభునకుఁ దనయుఁడౌ పార్వతీశ్వ
           రునకుఁ దిమ్మమకుఁ బుత్రు డయి షోడశమహా
                             దానముల్సప్తసంతానములును

           జేసి వంశవర్ధనుఁ డయి సిరుల వెలయు
           పేరమంత్రిశ్వరునకుఁ బోడూరి పెద్ద
           రాముఁ డెనుబది సంవత్సరములనాఁటి
           ప్రతి విమర్శించి వ్రాసిచ్చెఁ బక్షమునకు.

పోడూరి పెదరామహస్త లిఖితమైన యీ పురాతనతాళపత్రపుస్తకమును సంపాదించి యీ నడుమను నాకు బాలాంత్రపు వేంకటరావుగా రిచ్చిరి. దీనినిబట్టి చూడఁగా దాక్షాయణీవివాహకృతిపతియైన మల్లనసోమయాజి కుమారుఁడు లింగన్న; లింగన్న కుమారుఁడు యజ్ఞన్న; యజ్ఞన్న కుమారుడు పార్వతీశ్వరుఁడు, పార్వతీశ్వరునికుమారుఁడు పేరమంత్రి. ఈ పేరమంత్రి 1756 వ సంవత్సరమునందుండెను. పోతనమునిమనుమనిలములో నుండిన మల్లనసోమయాజికిని, పేరమంత్రికిని నడుమ నాలుగు పురుషాంతరములును, మల్లనసోమయాజికిని పోతనకును నడుమ మూఁడు పురుషాంతరములును మొత్తము గత 1756 -వ సంవత్సరమునం దుండిన గురజాల పేర మంత్రికిని బమ్మెరపోతనామాత్యునికీని నడుమ నేడు పురుషాంతరములు