పుట:Aandhrakavula-charitramu.pdf/582

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

555

శ్రీనాథుఁడు

      ప్రత్యర్థివంశకమలాకరపూర్ణ చంద్రః
      వినతనరపాలపాళీకనదురుమౌళి స్రగుదితగంధపాదాబ్జా
      అనితల్లీ పతిదేవా ఘనసచివీభూత భావుకా భువ మవతి.
      శాకే శరయుగవిశ్వే వైశాఖే మాసి భువ మప త్యనితల్లీ.
      సురవిప్రక్షేత్రకరం మార్కండేయేశసన్నిధౌ త్యక్తవతీ


* * * * * *



     శాకాబ్దే శరవేదరామశశభృత్సంఖ్యే శుభే శోభకృ
     ద్వర్షే శ్రావణకృష్ణవిష్ణుదివసే శ్రీకల్వచేఱుం శుభం.
     గ్రామం దత్తవతీ సతీ పరహితాచార్యా శైలాధిప
     శ్రీరామేశ్వరసన్నిధౌ పతిహిత శ్రీరన్నతల్ల్యంబికా.
     గ్రామస్య కలువచేఱో రన్నవరాఖ్యాం విధాయ నిజనామ్నా,
     పరహితభిషజే ప్రాదా దనితల్లీ గ్రామ మష్టభూతియుతం.

ఈ శాసనము శాలివాహనశకము 1345 శోభకృత్సంవత్సర శ్రావణ బహుళ ఏకాదశినా డనఁగా క్రీస్తుశకము 1423-వ సంవత్సరమునందు కలువచేఱు గ్రామమును అన్నవర మనుస్వనామముతో ననితల్లి పరహితాచార్యుఁ డను వైద్యశిఖామణి కగ్రహారముగా నిచ్చిన సందర్భమున వ్రాయఁబడినది. ఈ శాసనమునుబట్టి రాజమహేంద్రవరరాజ్యము కాటయ వేమారెడ్డి యనంతరమున నాతఁడు పుత్రహీనుఁడై న తరువాత నాతనిపుత్రిక యైన యనితల్లి కి వచ్చినట్టును, ఆమె పేరనే మొదట మామయయిన యల్లాడరెడ్డియు, పిమ్మట బావమైన వేమారెడ్డియు రాజ్యపాలనము చేసి నట్టును స్పష్టపడుచున్నది. రాజమహేంద్రవరరాజ్యము ననితల్లి పక్షమునఁ దన జీవితకాలములో నల్లాడరెడ్డి 1416-వ సంవత్సరము మొదలుకొని 1426-వ సంవత్సరమువఱకును పాలనము చేసెను. ఈతని పాలన కాలములోనే 1423-వ సంవత్సరమున ననితల్లి పేర దానశాసన ముండుట యితఁ డామె ప్రతినిధిగానే భూపరిపాలన మొనర్చినట్లు స్పష్టముగాఁ దెలియ