పుట:Aandhrakavula-charitramu.pdf/583

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

556

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

వచ్చుచున్నది. 1429-వ సంవత్సరము మొదలుకొని భర్తయైనవీరభద్రారెడ్డియు బావయైన వేమారెడ్డియు రాజ్యమేలుట యనితల్లిపక్షముననే యని వేఱుగఁ జెప్పవలసినపనీయే లేదు. కాశీఖండమునందు రాజ్య మనితల్లి దేయని కాని, యనితల్లి మూలమున వచ్చినదని కాని యెక్కడను జెప్పక

         సీ. త్రైలోక్యవిజయాభిదంబైన సౌధంబు
                          చంద్రశాలా ప్రదేశంబునందు
             సచివ సైన్యాధీశసామంతనృపవర
                          సీమంతినీజనశ్రేణి గొలువ
             శాస్త్రమీమాంసయు సాహిత్యగోష్ఠియు
                          విద్వత్కవీంద్రులు విస్తరింపఁ
             గర్పూరకస్తూరికాసంకుమదగంధ
                          సారసౌభము దిక్పూరితముగ

             నిజభుజోవిక్రమంబున నిఖిలదిశలు
             గెలిచి తను రాజ్యపీఠ మెక్కించినట్టి
             యన్న వేమేశ్వరునియంక మాశ్రయించి
             నిండుకొలువుండెఁ గన్నులపండువుగను.

అని యొకచోటను,

         సీ. ధరియింప నేర్చిరి దర్భ పెట్టెడు వ్రేళ్ల
                              లీల మాణీక్యాంగుళీయకములు
             కల్పింప నేర్చిరి గంగమట్టియమీఁదఁ
                              గస్తూరికాపుండ్రకములు నొసల
             సవరింప నేర్చిరి జన్నిదంబుల మ్రోలఁ
                              దారహారములు ముత్యాలసరులు
             చెరువంగ నేర్చిరి శిథిల నెన్నడుములఁ
                              గమ్మని క్రొత్త చెంగల్వవిరులు