Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/515

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

488

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

         క . కొమరగిరివసంతనృపా
             గమకవివరగంధసారకస్తూరీకుం
             కుమ కర్పూరహిమాంభ
             స్సముదంచిత బహుసుగంధిశాలాధ్యక్షా ! [ఆ.1-ప. 30]

అన్న పద్యములోని సంబోధనము తిప్పయసెట్టి కుమారగిరినిమిత్తము తెప్పించిన కర్పూరమును,గంధసారమును, కస్తూరిని విక్రయించు గొప్ప సుగంధదవ్యముల వాణిజ్యశాల శాల బెట్టిన వాఁడని చెప్పుచున్నది. అఱువదేండ్లు దాఁటిన ముసలి కోమటి యైన తిప్ప యసెట్టిని ద్వితీయాశ్వాసాంతమున "లలనాజనతాఝషలక్ష్మనిభా " స్త్రీ జనమునకు మన్మధతుల్యుఁడా ! యనియు, సప్తమాశ్వాసాంతమున 'కామినిహృద్యమూర్తీ " యనియు, పంచమాశ్వాసాంతమున - "సమర ఫల్గుణ" యనియు, సప్తమాశ్వాసాంతమున "సంగరపార్థ" యనియు, షష్ట్యంతములలో 'వారిణీసఖముఖముఖరితవీణానిక్వాణనిభకవిత్వఫణితికిన్ " అనియు స్తుతి చేసిన యతిశయోక్తుల నటుండ నిచ్చినను ఆ కాలములోని ఆంధ్ర వణిజులు విదేశవాసులతోను, ద్వీపాంతరఖండాంతరవాసులతోను సముద్రవ్యాపారమును విశేషముగా జరుపుచుండినట్లీ క్రింది పద్యములు సహస్రముఖముల ఘోషించుచున్నవి.

           *[1] సీ. పంజాబుకర్పూరపాదపంబులు దెచ్చి
                               జలనోగిబంగారుమొలక తెచ్చి
                 సింహళంబున గంధసింధురంబులు తెచ్చి
                               హురుమంజిబలు తేజిహరులు తెచ్చి
                 గోవసంశుద్ధసంకుమదద్రవము తెచ్చి
                               యాపగనాణిముత్యాలు తెచ్చి
                 చోటంగిఁ గస్తూరికాటంకములు తెచ్చి
                               చీనచీనాంబర శ్రేణి తెచ్చి

  1. [పంజార-పాఠాంతరము, మఱియు 'తెచ్చి' అనుచోట్ల 'తెచ్చె' అను భూతకాలిక క్రియయే కొన్నిటఁ గలదు.]