Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/494

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

467

శ్రీనాథుఁడు

మరణకాలమునకుఁ గాటయవేముని కనితల్లి యను కూఁతురును కుమారగిరి యను చిన్నకుమారుఁడును నుండిరి [పౌత్రీం కాటయవేమయ..... అను శ్లోకము సరిగా లేదనుచు నందలి విషయమునుగూర్చి శ్రీ ప్రభాకర శాస్త్రిగారు శృంగార శ్రీనాధమున విపులముగాఁ జర్చించిరి. శ్లోకమునుబట్టి కాటయవేమునికిఁ గాటయ యను కుమారుఁడు కలఁడనియు, అతడు హరిహరరాయల యల్లుఁడనియు, నా కాటయ కుమార్తె హరిహరాంబయనియు దెలియుచున్నది. హరిహరాంబ భర్త వీరభద్రారెడ్డి యన్నయగు వేమారెడ్డి యగుట ప్రసిద్ధము. వీరభద్రారెడ్డి కాటయవేముని కుమార్తె యగునని తల్లికి భర్త : కాఁగా, కాటయవేమారెడ్డి తన యల్లుని యన్నకుఁ దన పౌత్రి నిచ్చి వివాహ మొనర్చినట్లు తేలుచున్నది. ఇది యసంగతము. శాసనమున 'పుత్త్రీం కాటయవేమయక్షితిపతేః పౌత్రీంచ కాటప్రభోః' అని యుండ వలెను. కాటయవేముcడు తన కుమార్తెల నిద్దఱను, వేమవీరభద్రారెడ్డ కిచ్చి పెండ్లిచే సెను అనితల్లి, హరిహరాంబ లొక్క తల్లి కడుపునఁ బుట్టిన బిడ్డలు కానందున, వారి నన్నదమ్ముల కిచ్చి వివాహము చేయుట తప్పుకాదు. ఇట్టి వివాహము లనేకములు జరుగుచున్నవి. రాజమహేంద్రవరరాజ్యమా యల్లుండ్రిర్వురకు జెందఁదగుననరాదు. కాటయ వేమనకు రాజ్యము పిత్ర్యముకాదు. భార్యయగు దొడ్డాంబిక వలననే వచ్చినది కావున, దొడ్డాంబ కుమార్తె యగు అనితల్లికిని, తద్ద్వారమున నామె భర్తకును మాత్రమే సంక్రమించినది.

ఈ విషయము శృంగార శ్రీనాథమునఁ గలదు (చూ. పుటలు 286-289.) "ఆంధ్రకవి తరంగిణి" కర్త పయి యాశయముతో నేకీభవించలేదు. వీరు కాటయవేముడు హరిహరరాయల యల్లుడు కాఁడనుచున్నారు - విహహమున, శ్లోకమునుబట్టి తెలియుచున్న వావులలో అసంగతములు లేవని వీరి యభిప్రాయము, (ఐదవ సంపుటము. పుటలు 84-88]