466
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
మనుమరాలి భర్తయు నైన యల్లారెడ్డి సహాయుడుగా కోమటివేముని పరాజయము నొందించి యాతని సేనలను హతముచేసి రాజమహేంద్రవర రాజ్యమును నిరపాయముగా నిలుపుకొనెను. ఇతcడు రణరంగములయందు మహావీరుఁ డగుటయే కాక సమరపాండిత్యమునకుఁ దోడు భాషాపాండిత్యమునుగూడఁ గలవాఁడయి కాళిదాస ప్రణీతము లయిన శాకుంతలాది నాటకములకు సంస్కృతమున వ్యాఖ్యానములు రచించెను. ఈతనివలెనే యీతని బావ యగు కుమారగిరి రెడ్డియు సంస్కృతభాషా పాండిత్యముగల వాc డయి వసంతరాజీయ [1] మను కావ్యముసు రచించెను. ఈ వసంతరాజీయమునుండి కాటయవేముఁడు తన వ్యాఖ్యానములయందుఁ బ్రమాణ వచనముల నెత్తి చూపెను. సంస్కృతమునందుమాత్రమే కాక యాంధ్రమునందు సహితము మంచి పాండిత్యముగలవాఁ డయి కవుల నాదరించి వారిచే శ్లాఘింపఁబడుచుండెసు. ఈతనిని సంబోధించి యొక యాంధ్రకవి చెప్పిన పద్యమని నొక దాని నిందుదాహరించుచున్నాను
క. వెలయాలు శిశువు నల్లుఁడు
నిలయేలిక యాచకుండు నేగురు ధరలోఁ
గలిమియు లేమియుఁ దలఁపరు
కలియుగమునుఁ గీర్తికామ : కాటయవేమా !
కాటయవేమారెడ్డి 1416 వ సంవత్సరప్రాంతమునఁ గాలధర్మమునొందెను. ఈతని జీవితకాలములోనే యీతని పుత్రుఁడును హరిహరరాయని యల్లుఁడునైన కాటయరెడ్డి మరణము నొందెను. ఈ వివాహమునుగూర్చి యల్లాడ రెడ్డి కోరుమిల్లి శాసనములో నిట్లన్నది.
శ్లో. పౌత్రిం కాటయవేమయక్షితిపతేః పుత్రం చ కాటప్రభోః
దౌహిత్రం చతురర్ణవీం హరిహరక్షోణీపతే శ్శాసితుః
తన్నామ్నా విదితాహ్వయాం హరిహరాంబాం చారు మగ్రాహయ
త్పాణౌ వేమమహీశమల్లనృపతిస్సామ్రాజ్యలక్ష్మ్యా సమమ్.
- ↑ [వసంతరాజీయము నాట్యశాస్త్రముకాని కావ్యము కాదు. 'నామ్నావసంత రాజీయం నాట్యశాస్త్రం యదద్భుతమ్' ఇది లభించలేదు]