456
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
పతులు. వీరిలో రెండవవాఁడయిన ప్రోలయవేమారెడ్డి మహాపరాక్రమ శాలియయి ప్రతాపరుద్రుని ద.డనాధుఁడుగా నుండి యాతని యవసాన కాలమున 1420-వ సంవత్సర ప్రాంతమున యవనులతోడఁ బోరాడి తురుష్కులు చేకొన్న రాజ్యమును గొంత వారినుండి మరల బలాత్కారముగాఁ గైకొని రెడ్డిరాజ్యమును స్థాపించెను. ఈ విషయ మొక శాసనములో నీ కింది శ్లోకములయందుఁ జెప్పఁబడినది.
శ్లో. ఉద్దృత్య భూమిం యవనాబ్దిమగ్నాం
సంస్థాపయంతం ప్రకృతోత్తమార్యాః
సాక్షాత్కరో మానుష దేవభాజా
మహా వరాహం పరికీర్తయంతి.
శ్రీశైలగంగాతటసీమ్నిరమ్యాం
సోపానవీధీం వదధేనవేమః
యా దివ్యతి స్వర్గ మనోద్యతానాం
నిశ్రేణి రివ ప్రధితా నరాణాం.
పయి శ్లోకములలో నీ వేమభూపాలుఁడు శ్రీశైలములోని పాతాళగంగకు సోపానములు కట్టించినట్లు కూడ చెప్పబడియున్నది. ఇతcడు బంధుజనానురాగము గలవాఁడయి తన బంధువులను, తమ్ములను, కొడుకులను తన క్రింది యధికారులనుగాను, దండనాధులను గౌను నియమించి వారికిఁ దాను జయించిన దేశములలోఁ గొన్ని ప్రదేశము లిచ్చి యద్దంకి రాజధానిగాఁ బ్రజా పరిపాలనము చేయుచుండెను. ఈ యంశమును హరివంశములోని యీక్రింది పద్యము తెలుపుచున్నది.
గీ. తనకు నద్దంకి తగు రాజధానిగాఁ బ
రాక్రమంబున బహుభూము లాక్రమించి
యనుజతనుజబాంధవమిత్రజనుల కిచ్చె
నెదురె యెవ్వారు వేమమహీశ్వరునకు,