పుట:Aandhrakavula-charitramu.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మ డి కి సిం గ న్న

                 
                   నా మంత్రి విముఖాత్ముఁ డఖిలమునకు
   
            ననఁ బ్రగల్భరూపఘనదాననయమార్గ
            ముల నుతింపస నొప్పు ముజ్జగములఁ
            దారహారహీరధవళాంశుసమకీర్తి
            కలితుఁ డౌబళార్యకందవిభుఁడు.

కృతిపతికాలము తెలిసినప్పు డాతనియేలికయైన ముప్పధరణీపాలుని కాల మిదియే యని వేఱుగఁ జెప్పవలసిన పనియే లేదు. ఈ ముప్పరాజు రామగిరిపట్టణము రాజధానిగా గోదావరికి దక్షిణమునందున్న సబ్బినాటి రాజ్యమును పాలించినవాఁడు. ఈ కవి యెఱ్ఱాప్రెగడకు మిక్కిలి తరువాతివాఁ డయినసు ప్రబంధపరమేశ్వరు నేల స్తుతింపలేదో తెలియదు. ఒక్క పద్మపురాణమునందు మాత్రమే కాక వాసిష్ఠ రామాయణము నందును

        గీ. "వ్యాసవాల్మీకిశుకకాళిదాసబాణ
            హర్షణాదుల నాఢ్యుల నాత్మ నిలిపి
            సకలభాషారసజ్ఞుల సముల నన్న
            పార్యతిక్కకవీంద్రుల నభినుతింతు.

అని తెలుఁగు కవులలో నన్నయతిక్కనలను మాత్రమే నుతించెను. వాసిష్ట రామాయణము పద్మపురాణమునకుఁ దరువాతరచియింపఁ బడిన దగుటచేత నది 1420 తరువాతఁ జేయఁబడినది. ఈ రెండు కావ్యములకును నడుమ సింగన్న భాగవతదశమస్కంధమును గూడఁ దెనిగించి కందనామాత్యునకే యంకిత మొనరించెను. సింగనకృత భాగవతదశమస్కంధము నాకు లభింపలేదు. [1] [కందనమంత్రి రాజనీతిజ్ఞుడే గాక కవి యని కూడఁ దెలియుచున్నది. మడికి సింగన్నయే యితని "తారావళి" నుండి నాలుగు పద్యములను తన 'సకలనీతిసమ్మతము" నందు ఉదాహరించి యున్నాడు]

  1. [ఇది ద్విపద కావ్యము అముద్రితము]