404
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
అటుతరువాత నీ కవి సకల నీతిసమ్మత మను రాజనీతి గ్రంథమును సమకూర్చెనని రామకృష్ణకవిగారు చెప్పచున్నారు. [1]వీని నన్నిటిని విచారించి చూడగా మడికి సింగన్న 14౩౦ వ సంవత్సరమువఱకైన జీవించియుండును. ఈ కడపటి గ్రంథము పే రుదాహరింపలేదు గాని "పద్మపురాణోత్తర ఖండంబును భాగవత దశమస్కంధంబును దెనుంగున రచియించి" యని తక్కిన రెండు కావ్యముల పేరులను సింగన్న వాసిష్ఠరామాయణములో నుదాహరించెను. ఇతఁడు పద్మపురాణ దశమస్కంధములను నరాంకిత మొనర్చినను వాసిష్ఠరామాయణమును మాత్ర మట్లుచేయక శ్రీమదహాలోబలస్వామి కంకిత మొనర్చెను. వాసిష్ఠరామాయణములో నితడు మొట్టమొదట తెలుఁగు పద్యమును చేయక యాదిమకవీశ్వరాచారానుసారముగా నీ శ్లోకమును వేసెను.
"శ్రీమద్దివ్యమునీంద్ర చిత్ర నిలయం సీతామనో నాయకం
వల్మీకోద్భవవాక్పయోధి శశినం స్మేరాననం చిన్మయం
నిత్యం నీరదనీలకాయ మమలం నిర్వాణసంధాయినం
శాంతం నిత్య మనామయం శివకరం శ్రీరామచంద్రం భజే."
ఈ యాచారమును పూర్వకవులు కొందఱు కొన్ని పుస్తకములలో ననుసరించుచు వచ్చినను నిటీవలివారు పూర్ణముగా విడిచిపెట్టినారు. గణపతిదేవుని యాస్థానమున నుండిన కృతిపతిపూర్వుడైన గన్నయ మంత్రికాలమునుండి తరమునకు నలువదేసి సంవత్సరముల చొప్పున వేసి కృతిపతియైన కందనమంత్రి కాలమును 1420 వ సంవత్సరమునకు దింపినట్లే కృతికర్త యైన సింగన యుండిన 1420-వ సంవత్సరము మొదలుకొని తరమునకు నలువదేసి సంవత్సరముల చొప్పునవేసి కృతికర్త వంశమును గణపతిదేవుని కాలములో నుండిన తిక్కన వఱకును పైకెక్కించుచు వచ్చినచో నించుమించుగా నదియు సరిపోవును. కవిసింగన్న 1420 వ సంవత్సర ప్రాంతమునం దుండినచో నాతనితండ్రి యయ్యలుమంత్రి
- ↑ [ఈ గ్రంధమును శ్రీరామకృష్ణ కవిగారే ప్రకటించియున్నారు.]