366
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
కొనఁ బోయినప్పడు వా రతనిని "విధవకొడుకా !" యని పిలుచుచు పరిహసించుచు రాగా కొంత జ్ఞానము వచ్చినవాఁ డగుటచేత మనస్సులో వేదన పొంది తల్లి వలన తన జన్మవృత్తాంతమును దెలిసికొని, తక్టణ మా గ్రామము విడిచి పోయి దాక్షారామము చేరి భీమేశ్వరస్వామి యాలయములో లింగమును కౌగిలించుకొని వదలక కూరుచుండెనఁట ! అంతట స్వామి కా చిన్నవానియం దనుగ్రహము వచ్చి నీ 'వాడినదెల్ల నాటయు, పాడినదెల్ల పాటయు నగు"నని వరమిచ్చి పంపెనఁట ! ఆ బాలుఁడు మరల స్వగ్రామమునకు వచ్చినతరువాత నొకయింట బ్రాహ్మణసమారాధనము జరుగునప్పుడచ్చటికిఁబోఁగా బ్రాహ్మణు "లీ ముండకొడుకును లోపలికి రానియ్యఁ గూడ"దని తలుపులు లోపల గడియ వేసిరcట ! ఆంతట వడ్డనలయి లోపల భోజనము లారంభముకాఁఁగా, భీమన తలుపుల సందునుండి చూచి "మీ అప్పములు కప్పలుగాను; మీ యన్నము సున్నముగాను" అని శపించెనట ! ఆ శాపాక్షరములు సత్యము లయి వి స్తళ్ళలోని యన్నము సున్నమయి, అప్పములు కప్ప లయి దుముక లాడసాఁగెనఁట ! ఆప్పడు బ్రాహ్మణులందఱును భయపడి యది భీమనమహత్త్వ మని తెలిసికొని తలుపు తీసి, సున్నమును కప్పలను యథాపూర్వకముగా చేసినపక్షమున నాతనిని పంక్తిభోజనమునకు రానిచ్చెద మని చెప్పఁగా నతఁడు 'సున్న మన్నమును, కప్పలప్పములును కావలె" నన్న యుత్తరక్షణమునకే యవి యట్లయ్యెనఁట! నాఁటినుండియు బ్రాహ్మణు లాతఁడు వరప్రసాది యని తెలిసికొని, ఆతని కుపనయనాది సంస్కారములు చేయించి బహిష్కారము దీసివేసి, అతనిని పంక్తిభోజనములకు రానిచ్చుచు గౌరవింపుచుండిరి.
భీమకవి సంస్కృతమున రచియించినట్లు చెప్పఁబడెడు జ్యోతిష గ్రంథమును దెనిఁగించిన యెుకానొక కవి యించుమించుగా నీ కథనే తన గ్రంథావతారికయం దీ క్రింది సీసమాలికలోఁ జెప్పియున్నాఁడు.
సీ. శ్రీకరంబై ధరఁ జెలుపు గాంచినయట్టి
భీమపురంబునఁ బ్రేమమీఱ