పుట:Aandhrakavula-charitramu.pdf/339

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

312

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

        రాజమహేంద్రవరస్థాత రాజన
                  రేంద్రుఁ డెక్కువతాత యే విభునకు

          నంధ్రదళదానవోపేంద్రుఁ డగునుపేంద్ర
          ధరణి వల్లభుఁ డే రాజుతండ్రి తాత
          ఘనుఁ డుపేంద్రాఖ్యుఁ డెవ్వని కన్నతండ్రి
          యతఁడు విశ్వేశ్వరుఁడు లక్కమాంబసుతుఁడు

విశ్వేశ్వరరాజుకుమారుఁడయిన యుపేంద్రుని పుత్రుఁడు నృసింహభూపుడు శాలివాహనశకము 1325 వ సంవత్సరమునం దనఁగా క్రీస్తుశకము 1403 వ సంవత్సరము సందు పంచతీర్ధము నందలి ధర్మలింగేశ్వరస్వామి గుడికి గోపురము కట్టించిన ట్లొక శిలాశాసనమం దా దేవాలయములో వ్రాయఁబడి యున్నది. తాతకును, మనుమనికిని డెబ్బది సంవత్సరముల వ్యత్యాస ముండవచ్చును, గనుక నృసింహ భూపతితాత యైన విశ్వేశ్వర భూపుఁ డించుమించుగా 13౩౦ వ సంవత్సరమువఱకు నుండి యుండును. కాబట్టి యీ విశ్వభూపుని యాస్థానకవి యైన విన్నకోట పెద్దన్న యిప్పటి కయిదువందలయేఁబది సంవత్సరముల క్రిందట ననఁగా నెఱ్ఱాప్రెగడకంటె కొంచెము ముందుగానో యాతనికాలములోనో యున్నాఁడని నిశ్చయింప వలసి యున్నది. (ఈ “ఆంధ్రకవులచరిత్రము"లోని కాలనిర్ణయము సరిగా లేదని శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారు విభవ సం. భాద్రపదమాస'భారతి' యందు తెలుపుచు విన్నకోట పెద్దన్నను గూర్చి యిూ క్రింది విధముగా వివరించినారు.

"శాసనమునుబట్టి విమలాదిత్యుని కొడుకు రాజనరేంద్రుఁడు, అతనికొడుకు కులో త్తుంగచోడకేసరి. ఆతని వంశమున విమలాదిత్యునికొడుకు మల్లపదేవుఁడు, ఆతనిపుత్రుఁ డుపేంద్రుఁడు, ఉపేంద్రునికొడుకు మల్లప దేవుఁడు (2). ఆతనికుమారుఁడుపేంద్రుడు (3), ఆతనికుమారుఁడు