Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

290

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

భారతమునందలి విరాటపర్వము మొదలుకొని తెనిఁగింపఁబూనుటయు కూడ నధర్వణాచార్యుఁడు నన్నయభట్టునకుఁ దర్వాతను దాదాపుగా తిక్కనసోమయాజికాలములోను ఉన్నట్టు చూపుచున్నవి. ఈతని ఛందస్సులో

           క. "మగణమ్ముఁ గదియ రగణము
               వగవక కృతి మొదట నిలుపువానికి మరణం
               బగు నిక్క. మండ్రు మడియఁడె
               యగు నని యిడి తొల్లి టేంకణాదిత్యుఁ డనిన్."

అను పద్య మండుటచేత నితఁడు నన్నెచోడునికిఁ దరువాత బహుకాలమున కుండినవాఁ డని తెలియవచ్చుచున్నది. కాబట్టి యితcడిప్పటి కాఱునూటయేఁబది సంవత్సరముల క్రిందట నుండెను. ప్రధమాచార్యుఁ డనఁబడు నన్నయభట్టారకుని తరువాతనే యీతఁ డుండక పోయినయెడల, ఈతవిని ద్వితీయాచార్యుఁ డనుట యెట్లు తటస్థించును ? నన్నయభట్టారణ్యపర్వమువఱకును తెనిఁగించిన తరువాతనే యీతఁడు భారత మాంధ్రీకరింపఁబూని యుండనియెడల, విరాటపర్వము మొదలుకొనియే తెలిఁగించుటకుఁ గారణ మేమియు నగపడదు. నన్నయభట్టారకుఁడు తన గ్రంథ ప్రాశస్త్యమునకయి యధర్వణభారతమును కాల్చివేసె నన్న కధ యెంతమాత్రము విశ్వాసార్హమైనదికాదు. ఆధర్వణాచార్యుఁడు తిక్కన కాలములో ననఁగా 1260 -వ సంవత్సరప్రాంతములం దుండినవాఁడు. అధర్వుఁణుడన్న పేరాంధ్రులలో లేదనియు, ఇది కల్పితనామమయి యుండుననియు నొకరు వ్రాయుచున్నారు. అయిన నయి యుండవచ్చును. గాలి నరసయ్యశాస్త్రి తనపేరు బాగుగా లేదని ప్రభంజనాహోబలపండితుఁడని పేరు పెట్టుకొన్నట్టుగానే, తల్లిదండ్రులు నాలయ్యవంటి పేరేదో పెట్టి యుండఁగా నది గౌరవావహమైనది కాదని నాలవ దధర్వవేదమయినందున పూజనీయమయిన యా పేరు పెట్టుకొని యుండనువచ్చును. లేదా యితఁడు జైనుఁడు గనుక జైనులలో నట్టిపే రుండిన నుండను వచ్చును. అధర్వణుఁ డాంధ్రమునందు తగినంత పాండిత్యము గల సంస్కృత విద్వాంసుఁడైన జైనపండితుఁడు. ఇతఁడును దిక్కనసోమయాజియు