పుట:Aandhrakavula-charitramu.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మం చ న

యాజి 1250 వ సంవత్సరమునకుఁ దరువాత నున్నాఁ డన్న సత్యమును స్థాపించుచున్నది. పృధ్వీశరాజుమంత్రి మనుమడైన గుండనామాత్యునకుఁ గేయూరబాహుచరిత్ర మంకితము చేయఁబడి యుండుటచే నీ కవి తిక్కన సోమయాజికాలములోనో కొన్నియేండ్లు తరువాతనో యుండవలెను. కాcబట్టి యీ మంచనా మాత్యకవి 1300 వ సంవత్సరప్రాంతములయం దున్నాఁడని నిశ్చయముగాఁ జెప్పవచ్చును.

ఇతఁడు రాజమహేంద్రపురనివాసి. పయిని జెప్పఁబడిన వెలనాటిచోడుఁడు లోనయిన రాజులు చాళుక్యరాజప్రతినిధులుగా రాజమహేంద్రవరము రాజధానిగా వేఁగి దేశమును బాలించినవారే ! కృతినాయకుఁడు తన్నుఁ గూర్చి యన్నట్టుగా కవి యీ క్రింది పద్యమును వ్రాసికొని యున్నాఁడు.

         క. తన యిష్టసఖుని విద్వ
            జ్జనమాన్యుని నుభయకావ్యసరణిజ్ఞున్ మం
            చన నామధేయు నన్నుం
            గనుఁగొని యిట్లనియె వినయకౌతుక మెసఁగన్

             * * * * *

         క. సాయిరసము శృంగారం బై
            యలవడఁ గధలు నీతులై యెడనెడ రాఁ
            గేయూర బాహుచరితము
            చేయుము నీ వంధ్రవాక్యశిల్పము మెఱయన్."

ఈ కేయూరబాహుచరిత్రమునందు

         ఉ 'బాలరసాలసాలనవపల్లవకోమలకావ్యకన్యకన్
             గూళల కిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్
             హాలికులైన నేమి మఱియంతకు నాయతిలేనినాఁడు కౌ
             ద్దాలికులైన నేమినిజదారసుతాద్యభిరక్షణార్థమై.'

అను పద్యము ప్రథమాశ్వాసమునఁ గానఁబడుచున్నది. ఇటీవలివారు దీని కర్తృత్వమును బమ్మెర పోతరాజున కారోపించి వాడుకలో నున్న యా కధను గల్పించియుందురు. కావ్యకన్యను కూళల కియ్యఁగూడదు గాని